ఎవరికి వారే.. ఒకర్ని మించి ఇంకొకరు గొప్పగా నటించెయ్యాలన్న తపనతో వున్నట్లున్నారు తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ (Bigg Boss Telugu 4). మొదటి రోజే, హోస్ట్ కింగ్ నాగార్జున యెదుట ఎమోషనల్ అయిపోయిన కంటెస్టెంట్స్, హౌస్‌లోకి అడుగు పెడుతూనే, ‘కెమెరాని ఫేవర్’ చేయడానికి (Bigg Boss Telugu 4 First Week Nominations) చాలా చాలా ఆసక్తి చూపారు.
దాదాపుగా అందరిదీ ఒకటే తీరు. ఏ ఒక్కరిలోనూ నేచురాలిటీ కన్పించడంలేదన్న ‘అతి పెద్ద కంప్లయింట్’ ఈ సీజన్ తొలి రోజునే రావడం గమనార్హం. మొదటి సీజన్‌లో పెద్దగా ఎవరూ ఈ యాంగిల్‌లో ట్రై చేయలేదు. రెండో సీజన్ కోసం కాస్త ‘రాటు దేలి’ వచ్చారు కంటెస్టెంట్స్.
మూడో సీజన్‌లోనూ చాలామంది ‘కెమెరాని దృష్టిలో పెట్టుకుని’ పనిచేసినా, నాలుగో సీజన్‌లో మొత్తం అందరిదీ ఒకటే పని. ఒకరు ఏడిస్తే చాలు.. ‘ఎమోషనల్‌గా ఆడియన్స్ వాళ్ళకే కనెక్ట్ అవుతారేమో..’ అన్న ఆందోళనలో ఇతరులూ, వాళ్ళను మించి ‘ఏడుపు’ని పెర్ఫామ్ చేసేశారు.
‘ఓదార్చడంలోనూ’ అంతే. పుల్లలు పెట్టడంలోనూ ఎవరూ తక్కువ కాదన్నట్లు తయారైంది పరిస్థితి. ఆర్గ్యుమెంట్స్ విషయంలో తగ్గేదే లేదని అంటున్నారు. గంగవ్వ, నోయెల్.. ఇలా అతి కొద్ది మంది ప్రస్తుతానికి బెటర్. కరాటే కళ్యాణి అయితే, బిగ్‌హౌస్‌లో భూకంపం పుట్టించేసింది.
‘హాట్ అలర్ట్’ విభాగంలో అందాల భామలంతా దాదాపుగా మంచి మార్కులేయించేసుకున్నారు. సూర్య కిరణ్ ‘ఓవరాక్షన్’ అనే ఇమేజ్ తెచ్చేసుకున్నాడు. లాస్య బుల్లితెర యాంకర్‌గా ‘అతి’కి బ్రాండ్ అంబాసిడర్ కాగా, దాన్ని మించిన ‘అతి’ చూపించేస్తోంది బిగ్‌బాస్‌లో.. అనే కంప్లయింట్ ఆమె మీద గట్టిగానే వుంది.
ఇక, ట్రోలింగ్ విషయానికొస్తే.. అస్సలెవర్నీ వదలట్లేదు నెటిజన్లు. టీఆర్పీ రేటింగులకి ఇదే పెద్ద స్టఫ్ అవుతుందా.? అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘టీవీల్లోనో, మొబైల్‌లోనో చూడాల్సిన అవసరం లేదు.. ట్వీట్లు చూస్తే చాలు..’ అన్న భావన నెటిజన్లలో వ్యక్తమవుతుండడం మరో ఆసక్తికరమైన విషయం. నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.
ఏడుగురు నామినేషన్ రేసులో నిలిచారు. ఒక్కరంటే ఒక్కరూ సరైన రీజన్‌తో నామినేట్ కాకపోవడం వెరీ వెరీ స్పెషల్ అనుకోవాలా.? నామినేట్ అయినవారిలో (Bigg Boss Telugu 4 First Week Nominations) గంగవ్వ (Ganga Avva), దివి (Divi Vidtya) , సుజాత (Sujatha), అఖిల్ (Akhil Sarthak), మెహబూబ్ (Mehaboob Dilse), సూర్య కిరణ్ (Surya Kiran), అభిజిత్ (Abhijeet) వున్నారు. వీరిలో ఎవరు సేవ్ అవుతారు.? అన్నది ఈ వారాంతం ఎపిసోడ్‌తో తెలుస్తుంది.