మొహాలకి వున్న మాస్క్‌లు తీసెయ్యమంటే, బిగ్‌హౌస్‌లో (Bigg Boss 3 Telugu) కంటెస్టెంట్స్ (Mahesh Vitta Ali Reza BB3) కొట్టుకునే పరిస్థితికొచ్చారు. వీకెండ్ ఎపిసోడ్స్‌ని రక్తి కట్టించేందుకోసం బిగ్ హోస్ట్ అక్కినేని నాగార్జున ‘అవార్డుల్ని’ ప్రవేశపెడితే, ఆ అవార్డులు కాస్తా, బిగ్‌హౌస్‌లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నాయి.
ప్రెషర్ కుక్కర్, ఆటలో అరటిపండు.. ఇలాంటి అవార్డులతోపాటు ‘అగ్గిపుల్ల’ (Bigg Boss Telugu 3) అవార్డ్ కూడా వుంది కంటెస్టెంట్స్‌కి నాగార్జున ఇచ్చిన పురస్కారాల్లో. ఆ అగ్గిపుల్లే, ఇప్పుడు బిగ్‌హౌస్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య చిచ్చుపెట్టింది. మహేష్ విట్టాకి ‘అగ్గిపుల్ల’ పురస్కారం దక్కిన విషయం విదితమే.
ఒకరిద్దరు మినహా మిగతా కంటెస్టెంట్స్ అంతా మహేష్ విట్టాన్ని ‘అగ్గిపుల్ల’ అంటూ వెటకారం చేస్తున్నారు. అయితే, వాటన్నిటినీ లైట్ తీసుకున్న మహేష్ విట్టా, కెప్టెన్ అలీ రెజా సీరియస్ టోన్‌లో ‘నువ్వు పుల్ల పెట్టొద్దు’ అనేసరికి ఫైర్ అయిపోయాడు. బాబా భాస్కర్ – అలీ రెజా (Baba Bhaskar Ali Reza) మధ్య నామినేషన్ ఎపిసోడ్‌కి సంబంధించి డిస్కషన్ హాట్ హాట్‌గా జరుగుతోంది.
సహజంగానే అలీ రెజాకి కోపమెక్కువ. ఎవరు బుజ్జగిస్తున్నా అలీ రెజాకి పరిస్థితి అర్థం కావడంలేదు. మరోపక్క, బాబా భాస్కర్ తాను కన్వే చేయాలనుకున్న విషయాన్ని అలీ రెజాకీ చెప్పలేకపోతున్నాడు. ఈ టైమ్‌లోనే మహేష్ విట్టా సీన్‌లోకి ఎంటర్ అయ్యాడు.
‘బాబా భాస్కర్ మనోగతం ఇదీ..’ అని చెప్పేలోపే అలీ రెజా ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘మా మధ్య పుల్ల పెట్టకు..’ అంటూ మహేష్ విట్టాపై (Mahesh Vitta) గుస్సా అయ్యాడు. దాంతో వాతావరణం వేడెక్కిపోయింది. ఇద్దరూ కొట్టుకునే స్థాయికి వ్యవహారం వెళ్ళింది. నిజానికి, ఈ ఎపిసోడ్‌లో మహేష్ విట్టా నోరు జారింది లేదు. కానీ, వ్యవహారం వేరేలా కన్వే అయ్యింది.
అసలంటూ నాగార్జున ఆ ‘అగ్గిపుల్లు’ అవార్డు (Mahesh Vitta Ali Reza BB3) ఇచ్చి వుండకపోతే ఈ కొట్లాట సీన్ వచ్చేది కాదేమోనన్నది చాలామంది అభిప్రాయం. ఇక, హౌస్‌లో అలీ రెజాని కూల్ చేయాల్సింది పోయి శ్రీముఖి, హిమజ తదితరులు అగ్నికి ఆజ్యం పోసేందుకు ప్రయత్నించారు.
పూర్తిగా విషయం కాని అర్థం కాని పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam) కూడా మహేష్ విట్టాని అపార్థం చేసుకుంది. హీటెడ్ ఆర్గ్యుమెంట్‌లో మహేష్ విట్టా అనకూడని మాటలు అనేశాడంటూ హౌస్‌మేట్స్‌లో కొందరు గుస్సా అవుతున్నారు.