Bigg Boss Non Stop Controversy.. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా బిగ్ బాస్ రియాల్టీ షో అనేది మోస్ట్ పాపులర్. వివాదాల వల్ల కావొచ్చు, కంటెస్టెంట్ల ఓవరాక్షన్ కావొచ్చు.. కారణం ఏదైతేనేం, ప్రతి సీజన్ అంచనాలకు మించి తన పాపులారిటీని పెంచుకుంటూ వెళుతోంది.
టీఆర్పీ రేటింగులు తగ్గడమో, ఓటింగ్ తగ్గడమో.. ఇవన్నీ అసలు చర్చనీయాంశాలే కావన్నట్టుగా బిగ్ బాస్ రియాల్టీ ‘షో’ అలా అలా కొనసాగుతూనే వుంది.
బిగ్ బాస్.. అదో చిత్ర విచిత్ర లోకం.!
ఓటీటీ స్పెషల్ వెర్షన్ వచ్చాక సీన్ మరింత మారింది. ఎప్పుడైనా బిగ్ బాస్ రియాల్టీ షో చూసెయ్యొచ్చు. ఇరవై నాలుగ్గంటలూ హౌస్‌లో ఏం జరుగుతోందో తెలుసుకునే అవకాశం దొరికింది.. ఈ షోని ఇష్టపడేవారికి. నచ్చిన కంటెస్టెంట్లని భుజాన మోయొచ్చు.. నచ్చనివారిని పాతాళానికి తొక్కేయొచ్చు.
ఇవన్నీ నాణానికి ఓ వైపు. బిగ్ బాస్ రియాల్టీ షోని లైసెన్సు పొందిన వ్యభిచార కేంద్రంగా ఓ రాజకీయ ప్రముఖుడు అభివర్ణించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. నచ్చినోళ్ళు బిగ్ బాస్ చూస్తారు, నచ్చనోళ్ళు లైట్ తీసుకుంటారు.
అంతేగానీ, కంటెంట్ కొంచెం హద్దులు దాటినంతమాత్రాన దాన్ని వ్యభిచా కేంద్రంగా అభివర్ణించడం ఎంతవరకు సబబు.? బాధ్యతగల వ్యక్తులు చేయాల్సిన విమర్శలు కావివి.
Bigg Boss Non Stop Controversy..అసభ్యతకి అర్థం మారిపోయిందిక్కడ.!
ఓటీటీ ట్రెండ్ వైపు జనం కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం మొదలయ్యాక, ‘బూతు’ అన్న మాటకి అర్థమే మారిపోయింది. ఆ మాటకొస్తే, ఇంటర్నెట్ ప్రతి మొబైల్ ఫోన్లోకీ చేరిపోయాక, ‘అసభ్యత’ గురించి మాట్లాడుకోవడమే అనవసరం.
బిగ్ హౌస్‌లోకి వెళ్ళాక ఏం చేస్తే, బయట నుంచి తమను చూస్తున్నవారికి ‘కావాల్సిన వినోదం’ లభిస్తుందో పక్కాగా ముందే స్కెచ్ వేసుకుని.. తనదునుగుణంగా ‘నటించేయడం’ బిగ్ బాస్ రియాల్టీ షోలో ప్రత్యకత.
Also Read: Samyuktha Menon: ‘పవర్’ అన్లిమిటెడ్.!
నిజానికి, ఇందులో రియాల్టీ ఏమీ వుండదు. పేరుకే రియాల్టీ షో.. లోపలంతా నటనే. అది నటన కాకపోతే, బిగ్ బాస్ జంటలేవీ రియల్ లైఫ్ జంటలెందుకు కాలేకపోయాయి.? బిగ్ బాస్ విరోధులు నిజ జీవితంలో ఎందుకు స్నేహితులవుతున్నారు.?
జస్ట్ నాన్సెన్స్.. జస్ట్ మ్యాడ్నెస్.. అంతకు మించి బిగ్ బాస్‌లో ఇంకేమీ లేదు. దీన్నొక ఎంటర్టైన్మెంట్గా చూడాలి తప్ప, వ్యభిచార కేంద్రమనో.. ఇంకోటనో అనడం.. పైగా అలాంటి వ్యాఖ్యలు రాజకీయ నాయకుల నుంచి రావడం.. వారి స్థాయిని తగ్గించుకోవడమే.