Bigg Boss NonStop Winner.. బిగ్ బాస్ రియాల్టీ షో అంటేనే ఓ ’రోత‘ అన్న అభిప్రాయం బుల్లితెర వీక్షకుల్లో బలంగా నాటుకు పోయింది. లోపల జరిగేదంతా నాటకమే.
ఆడించేది బిగ్ బాస్.. ఆడేది కంటెస్టెంట్లు. మధ్యలో ఓటేసిన వీక్షుకులే వెర్రి వెంగళప్పలవుతారన్నది నిర్వివాదాంశం. గత సీజన్లలో జరిగింది అదే. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఇందుకు మినహాయింపేమీ కాదు.
హోస్ట్‌గా ఎవరున్నా, ’ఇదంతా నిజ్జంగా నిజం.. నిఖార్సయినా, దమ్మున్న రియాల్టీ షో ఇది..’ అని చెప్పాల్సిందే. అలా చెప్పడానికి గత కొద్ది సీజన్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు.
బిందు మాధవి వర్సెస్ అఖిల్ సార్థక్
బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాల్టీ షో విషయానికొస్తే, ముగింపుకి వచ్చేసింది. గెలుపెవరిదన్నది తేలడమొక్కటే మిగిలింది.
హాట్ ఫేవరెట్స్‌గా బరిలో వున్నది బిందు మాధవి, అఖిల్ సార్ధక్. వీళ్ళిద్దరికీ సోషల్ మీడియాలో బోల్డంత ఫాలోయింగ్ కనిపిస్తోంది.
బిందు మాధవి తెలుగులో హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. తమిళ సినిమాలు కూడా చేసింది. అలా ఆమెకు పాపులారిటీ వుండడం సహజమే. తమిళ వెర్షన్ బిగ్ బాస్‌లో కూడా కనిపించిందామె.

గతంలో అఖిల్ సార్ధక్ బిగ్‌బాస్‌లో కనిపించాడు గనుక, అతనికీ ఓ మోస్తరుగా పాపులారిటీ వుండొచ్చు.
Bigg Boss NonStop Winner.. గెలుపు కోసమేనా ఇదంతా.?
అయితే, వాస్తవ పాపులారిటీ కంటే కూడా, పెయిడ్ పాపులారిటీ వీళ్ళిద్దరికీ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
పెయిడ్ పాపులారిటీ లేకుండా బిగ్ బాస్ రియాల్టీ షోలో నెట్టుకురావడం ఎవరికైనా కష్టమే.
బిగ్ బాస్ నాన్ స్టాప సీజన్ మొదలైనప్పటినుంచీ, ఇరువురి బ్యాక్ ఎండ్ టీమ్స్.. చాలా యాక్టివ్‌గా వున్నాయి సోషల్ మీడియాలో.
వాళ్ళే ఓట్లు వేశారు, వేయించారు. ప్రత్యర్థి కంటెస్టెంట్లపై జుగుప్సాకరమైన ప్రచారమూ చేయించారు.
బిందు మాధవి, అఖిల్ సార్ధక్ తరఫున మాత్రమే కాదు, అరియానా గ్లోరీ సహా చాలామంది కంటెస్టెంట్లు తమ పీఆర్ బృందాల ద్వారా చేయించింది ఇదే.
ఈ రచ్చ అంతటికీ ముగింపు పడనుంది.. టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోతే.
Also Read: నాన్సెన్స్.! సన్నీలియోన్‌కి అభిమానులేంటి.?
గతంలో కౌశల్ దగ్గర్నుంచి మొదలైంది ఈ తరహా రచ్చ. టైటిల్ ఎవరు గెలిచినా, దాంతో వాళ్ళకి కొమ్ములేమీ వచ్చేయవు. కాకపోతే కొంత పాపులారిటీ పెరగొచ్చు. ఆమాత్రందానికి ఇంత యాగీ అవసరమా.?