బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్ 4 (Bigg Boss Telugu 4 Army Warriors) కోసం అంతా సిద్ధమయిపోయింది. కింగ్ అక్కినేని నాగార్జున దుమ్మురేపేస్తానంటున్నాడు హోస్ట్‌గా. గత సీజన్లను మించి, ఈసారి కంటెస్టెంట్స్ సత్తా చాటేయబోతున్నారట.
ఆ కంటెస్టెంట్లు ఎవరు.? అన్న సంగతి పక్కన పెడితే, ఆయా కంటెస్టెంట్స్ తాలూకు బ్యాక్ ఎండ్ టీమ్స్, సోషల్ మీడియా వేదికగా సందడి చేయడానికి సిద్ధంగా వున్నాయి. ఎవరి ఆర్మీ ఎలా వుంటుంది.? ఎవరి వారియర్స్ దమ్మెంత.? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రానున్న రోజుల్లో తెలుస్తాయ్.
తొలి సీజన్‌కి ఎలాంటి ఆర్మీలూ లేవు. రెండో సీజన్‌కి వచ్చేసరికి, మధ్యలో ‘కౌశల్ ఆర్మీ’ లైమ్ లైట్‌లోకి వచ్చేసి నానా హంగామా సృష్టించేసింది. ఆ కౌశల్ ఆర్మీ లేకపోయింటే, కౌశల్ విన్నర్ అయ్యేవాడు కాదేమో. ఇక, ఆ తర్వాత కంటెస్టెంట్స్ పూర్తిస్థాయిలో ‘ఆర్మీలు’ సిద్ధం చేసుకుని, హౌస్‌లోకి అడుగు పెట్టాయి.
మేజర్ కంటెస్టెంట్స్ తమ స్థాయికి, స్తోమతుకు తగ్గట్టు బ్యాక్ ఎండ్ టీమ్స్ నడిపాయన్న ప్రచారం వుంది. మూడో సీజన్ నాటికి ముదిరిపోయిన ఆర్మీలు, ఈసారి మరింత అనూహ్యంగా దుమ్ము రేపేయబోతున్నాయట. ఇందుకోసం లక్షలకు లక్షలు వెచ్చించేశారన్న ప్రచారం జరుగుతోంది.
‘గెట్ రెడీ ఆర్మీస్..’ అంటూ నెటిజన్లు, కంటెస్టెంట్లెవరో తెలియకుండానే సెటైర్లు వేసేస్తుండడం గమనార్హం. అసలు కరోనా సీజన్‌లో బిగ్‌బాస్ వుండకపోవచ్చు.. అన్న ప్రచారం నుంచి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఏదీ అడ్డు కాదనే స్థాయికి బిగ్‌బాస్, బుల్లితెర వ్యూయర్స్‌ని అలరించేయబోతోంది.
కంటెస్టెంట్స్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంది బిగ్‌బాస్ టీమ్. కొద్ది రోజుల ముందు ఐసోలేషన్‌లోకి పంపి, ఆ తర్వాత మాత్రమే వారు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారట.
ఎన్ని చేసినా కరోనా ఏదో ఒక రూపంలో కంటెస్టెంట్స్‌ని (Bigg Boss Telugu 4 Army Warriors) పలకరించే ప్రమాదం లేదు. అదే గనక జరిగితే.? ఏమవుతుందో ఏమోగానీ.. అలాంటి పరిస్థితే రాకూడదని ఆశిద్దాం.