బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో గ్లామర్ (Bigg Boss Telugu 4 Glamour) చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. గత సీజన్లతో పోల్చితే, ఈసారి కంటెస్టెంట్స్.. అది మేల్ కంటెస్టెంట్స్ కావొచ్చు, ఫిమేల్ కంటెస్టెంట్స్ కావొచ్చు.. దాదాపుగా అందరూ సూపర్ స్ట్రాంగ్. మరీ ముఖ్యంగా ఫిమేల్ కంటెస్టెంట్స్ ఈసారి కాస్త ఎక్కువగా, చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు.
గంగవ్వ (Gangavva) సైతం తాను చాలా ‘టఫ్’ అని ఇప్పటికే నిరూపించేసింది. లాస్య కాస్త సైలెంట్‌గా కనిపిస్తున్నా, ఆమె కూడా తక్కువేమీ కాదు. ఇక, దేవి నాగవల్లి (Devi Nagavalli) సంగతి సరే సరి. జోర్దార్ సుజాత (Jordar Sujatha) కూడా టైమ్ వస్తే, తన సత్తా చూపించేయడానికి రెడీగా వుంది.
మోస్ట్ గ్లామరస్ గాల్స్ విషయానికొస్తే, మోనాల్ గజ్జర్ (Monal Gajjar) తోపాటు హౌస్‌లో దివి (Divi Vadthya), అలేఖ్య హారిక (Alekhya Harika), అరియానా గ్లోరీ (Ariyana Glory) లకు తోడుగా వచ్చింది కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ (Swathi Deekshit). ఇంతటి గ్లామర్ ఇంతకు ముందు ఏ సీజన్‌లోనూ లేదని ఇస్సందేహంగా చెప్పొచ్చు. మోనాల్ చాలా స్ట్రాంగ్ మైండెడ్.
అరియానా గ్లోరీ ఎలాగైనా గెలవాలనే కసితో కనిపిస్తుంటుంది. అలేఖ్య హారిక కూడా వన్ ఆఫ్ ది టఫెస్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. ఇక, దివి సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె టాప్ 3లో వుండేందుకు ఛాన్సుందంటూ ఇప్పటికే నెటిజన్లు ఓ ఐడియాకి వచ్చేశారు.
ఏ మాటనైనా కుండబద్దలుగొట్టేయడంలో దివి దిట్ట. లేటెస్ట్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ (Swathi Dixit) కూడా చాలా స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. అయితే, గతంలో పూజా రామచంద్రన్ షడెన్ ఎంట్రీ ఇచ్చినట్లుంది తప్ప, స్వాతి ఎక్కువ వారాలు హౌస్‌లో వుండకపోవచ్చు. వుంటే మాత్రం.. ఆమె కూడా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్‌లానే కనిపిస్తోంది.
ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇంతటి గ్లామర్ నడుమ.. హీరోలు, అదేనండీ పురుష పుంగవులంతా తేలిపోతున్నారు. నోయెల్, అబిజిత్, అఖిల్ సార్దక్, సోహెల్, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, అవినాష్, కుమార్ సాయి.. వీళ్ళేమీ తక్కువోళ్ళు కాదుగానీ.. లేడీ కంటెస్టెంట్స్‌తో పోల్చితే, ఆ ఎనర్జీని మ్యాచ్ చేయగలరా.? లేదా.? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయ్.
ఏమో, గత సీజన్లకు భిన్నంగా ఈసారి ఫిమేల్ కంటెస్టెంట్ విన్నర్‌గా నిలుస్తుందేమో.!