బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో (Bigg Boss Telugu 4 Kattappa) నాలుగో సీజన్ ‘కటప్ప’ కారణంగా తెగ బోర్ కొట్టేస్తోంది. మెజార్టీ బిగ్ బాస్ వ్యూయర్స్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు కట్టప్ప ఎవరు.? ఏం చేస్తున్నాడు.? ఇది కంటెస్టెంట్స్‌కి మాత్రమే కాదు, బిగ్‌బాస్ వీక్షకులకీ అర్థం కావడంలేదాయె.
గత సీజన్లలోనూ ఓ టాస్క్ ఇచ్చి ‘కట్టప్ప’లా వ్యవహరించమనేవాడు బిగ్‌బాస్. అయితే, దానికి ‘కట్టప్ప’ అని పేరు పెట్టలేదనుకోండి.. అది వేరే సంగతి. ‘బాహుబలి’లో కట్టప్ప గురించి తెలుసు. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.?’ అన్న ప్రశ్న చుట్టూ క్రియేట్ అయిన హైప్ అంతా ఇంతా కాదు.
ఆ ‘కట్టప్ప’ పరువు పోయేలా వుందిప్పుడు. ఒకరోజు సరే, రెండో రోజూ ఓకే.. కానీ, రోజుల తరబడి ‘కట్టప్ప కథ’ నడుస్తోంటే బోర్ కొట్టేయకుండా వుంటుందా.? ఓసారి కట్టప్ప విషయమై కంటెస్టెంట్స్ తమ అభిప్రాయాల్ని ఓ పేపర్ మీద రాసి బిగ్‌బాస్‌కి చూపించేశారు.
ఇంకోసారి ‘స్టాంపులు’ వేశారు కట్టప్ప అంటూ ఆయా కంటెస్టెంట్స్ మీద. అయినాగానీ, ఇంకా ‘కట్టప్ప’ ఎవరనేది తేలలేదు. వీకెండ్ షోలో నాగార్జున ఏమన్నా ఈ కట్టప్ప గురించి రివీల్ చేస్తాడో.. లేదంటే దాన్ని ఇంకా కొనసాగిస్తారో అర్థం కాని పరిస్థితి.
బిగ్ బాస్ రియాల్టీ షోకి సంబంధించినంతవరకు ఇప్పటిదాకా ఏ సీజన్‌లోనూ లేనంత చెత్త టాస్క్‌గా దీన్ని బిగ్‌బాస్ అభిమానులే అభివర్ణిస్తుండడం గమనార్హం. ప్రస్తుతానికైతే నోయెల్, లాస్య తదితరుల మీద ‘కట్టప్ప ముద్ర’ గట్టిగా పడింది.
వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కట్టప్ప అయి వుంటారా.? ఇంకెవరన్నానా.? అసలు కట్టప్ప అంటూ ఎవరూ హౌస్‌లో లేరా.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి వుంది. నిజానికి, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా బిగ్‌బాస్ వ్యూయర్స్‌లో చచ్చిపోయింది.
అదే సమయంలో బిగ్‌హౌస్‌లో కంటెస్టెంట్లు మాత్రం కట్టప్ప ఎవరో తెలియక జుట్టు పీక్కోవాల్సి వస్తోంది.
(24 గంటల్లో జరిగే విషయాల్ని, కేవలం గంటలో చూపించేస్తున్నారు గనుక.. వీళ్ళదే తప్పు, వీళ్ళది రైట్.. అని మనం జడ్జ్ చేసెయ్యలేం.)