Bigg Boss Telugu 5 Controversy.. నేతి బీరకాయ్లో నెయ్యి ఉంటుందా.? బిగ్‌బాస్ రియాల్టీ షోలో రియాల్టీ ఉంటుందా.? కొన్నాళ్ల క్రితం అంటే, అది బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 నాటి వ్యవహారం. కంటెస్టెంట్ భానుశ్రీ చేసిన అల్లరి అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే అల్లరి ఇప్పుడు సిరి హన్మంత్ చేసింది. అప్పుడు బాధితుడు కౌషల్. ఇప్పుడు బాధితుడు సన్నీ.
అప్పుడు యాపిల్ పండు.. ఇప్పుడు బ్యాటన్. అంతే తేడా. ఫిజికల్ టాస్క్ కోసం అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి తలపడితే.. ఒక్కోసారి అనుకోకుండా ఒకరి ప్రయివేట్ పార్ట్స్ఇంకొకరు తాకడం జరగొచ్చు. అది బిగ్‌బాస్‌కి కూడా తెలుసు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు, ఆ సన్నివేశాల్ని చూపించకుండా ఉంటే సరిపోతుంది.
కానీ, అలా చూపించకుండా ఉంటే మజా ఏముంటుంది. రచ్చ ఎలా జరుగుతుంది.? కౌషల్ మీద భాను వేసిన నింద తాత్కాలికంగా కౌషల్ ఇమేజ్‌ని దెబ్బ తీసింది. భానుకి సింపథీ వచ్చింది. కానీ, తర్వాత ఏం జరిగింది.? కౌషల్ (Kaushal Manda) సీజన్ విన్నర్ అయ్యాడు. భాను (Bhanu Sri) తక్కువ సమయంలోనే బిగ్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది.
రచ్చహ.. రచ్చస్య.. రచ్చోబ్యహ..
ఇప్పుడు సిరి హన్మంత్ (Siri Hanmanth), సన్నీల (Sunny VJ) విషయంలో ఏం జరుగుతుంది.? సెంటిమెంట్ ప్రకారం సిరి వికెట్ పడిపోవాలి. సన్ని ఈ సీజన్ విన్నర్ అవ్వాలి. కానీ, అలా జరగడానికి అవకాశాలు తక్కువ. రావాల్సిన స్థాయిలో సన్నీకి సింపతీ రాలేదు. సిరికి నెగిటివిటీ మాత్రం వచ్చింది. మధ్యలో షణ్ముఖ్ కూడా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తోంది.
సన్నీ, సిరిని అసభ్యకరంగా తాకలేదని హోస్ట్ నాగార్జున నిరూపించడం వల్ల ఒరిగిందేంటీ.? ఈ మొత్తం వివాదంలో నిందితుడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu). ఇలాంటి టాస్కులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చూపించేటప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి. కానీ, ఇవేవీ జరగవు. ఏ స్థాయికి దిగజారిపోయి అయినా వివాదాల్ని హైలైట్ చేయడమే ఈ షో సిద్ధాంతం.
గత సీజన్ సమయంలో కూడా మోనాల్ (Monal Gajjar), అవినాష్ (Avinash) మధ్య ఈ తరహా ఘటన జరిగింది. స్కిప్ట్ పెద్దగా మారడం లేదు. వీటన్నింటికీ సిద్ధపడే కంటెస్టెంట్లు వస్తున్నారు. జస్ట్ ఇదొక నాటకం. బిగ్‌బాస్ (Bigg Boss Telugu 5 Controversy) ఆడించినట్టల్లా ఆడటమే కంటెస్టెంట్ల పని. ఇందులో రియాల్టీ ఏముంది.? మీరు మీలా ఉండండి అని కంటెస్టెంట్లకు చెప్పడం అర్ధం పర్ధం లేని మాట.