Table of Contents
Bigg Boss Telugu 6.. బిగ్ బాస్ రియాల్టీ షో అంటేనే అదొక మాయ.! ఎవరు గెలిచారు.? ఎవరు ఓడారు.? ఎవరు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు.? ఇవేమీ లెక్కలు తేలవు.
ఇదిగో ఇన్ని ఓట్లు వచ్చాయి.. ఇదిగో వచ్చిన ఓట్లకు సంబంధించిన వివరం.! ఇలా ఏమీ వుండదక్కడ. టీఆర్పీ రేటింగులు చూస్తే చాలా వరస్ట్‌గా కనిపిస్తున్నాయి.
కానీ, ‘షో’ సూపర్ హిట్ అంటాడు హోస్ట్ అక్కినేని నాగార్జున. తప్పదు, ఫ్లాప్ సినిమా అవుతుందని తెలిసినా, విడదులకు ముందు ప్రమోషన్స్ అలాగే చేసుకోవాలి.
సినిమా విడుదలై, డిజాస్టర్ అని తేలినా.. ‘మా సినిమా హిట్టే..’ అని చెప్పుకోవడం వల్ల ఉపయోగమేంటి.?
Bigg Boss Telugu 6.. ఎవరు గెలిచారు.? ఎవరు ఓడారు.?
గత సీజన్లతో పోల్చితే, ఈసారి ఎవరూ బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆయా కంటెస్టెంట్ల తరఫున కొందరు సోషల్ మీడియాలో హంగామా చేశారంతే.
ప్రైజ్ మనీ ప్రకటించారు.. కోతలు పెట్టేందుకు టాస్కులు ఆడించారు. తూచ్.. ప్రైజ్ మనీ మారలేదన్నారు. షరామామూలుగానే, చివర్లో డబ్బు ఆశ చూపించారు.
డబ్బు గెలిచిందా.? అంటే, ఔనని చెప్పక తప్పదు. డబ్బుకి లొంగిపోయి, ఓటమిని అంగీకరించేశాడు శ్రీహాన్. ప్రైజ్ మనీ 50 లక్షలు కాగా, 40 లక్షలు ఆశ చూపేసరికి ట్రోఫీ వదులుకున్నాడు.
రేవంత్ పరిస్థితేంటి.?
ఓడిన శ్రీహాన్ 40 లక్షలు గెలుచుకుంటే.. గెలిచిన రేవంత్ దక్కించుకున్నది పది లక్షలు మాత్రమే. ఓ ప్లాటు, కారు.. ఇవి అదనం విజేతకి.
విన్నర్ అనే గుర్తింపు ముందర డబ్బు బలాదూర్ అనుకున్నాడు రేవంత్. గెలవడం కంటే డబ్బు ముఖ్యం అని శ్రీహాన్ నిరూపించాడు. ఒకరు డబ్బుని గెలిస్తే, ఇంకొకరు టైటిల్ గెలిచారు. ఇదీ కథ.
ఆ లెక్కన ఇద్దరూ గెలిచారనాలా.? ఇద్దరూ ఓడారనాలా.? ఎవరైనా ఏమైనా అనుకోండి. ఇదో వెర్రి వెంగళప్ప టాస్క్ అంతే.
నాసిరకం బిగ్ బాస్..
సీజన్లు మారుతున్నకొద్దీ బిగ్ బాస్ మరీ నాసిరకంగా తయారవుతోంది. కొత్తగా ఆలోచించకపోతే, తెలుగులో బిగ్ బాస్‌కి మనుగడ వుండదు. అక్కినేని నాగార్జున ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో.!
Also Read: ఐటమ్ భామల కొట్లాట: జాక్వెలైన్ వర్సెస్ నోరా ఫతేహీ.!
కాదు కాదు, తెలుసుకోవాల్సింది నిర్వాహకులు మాత్రమే. హోస్ట్ గురించి అంటారా.. నిర్వాహకులు ఎవర్ని హోస్ట్‌గా వుంచాలనుకుంటారన్నది వాళ్ళ ఇష్టం.