అదఃపాతాళానికి తొక్కేశావ్ పవన్ కళ్యాణ్.!

 అదఃపాతాళానికి తొక్కేశావ్ పవన్ కళ్యాణ్.!

Pawan Kalyan

Pawan Kalyan Surgical Strike .. రాజకీయాల్లో విమర్శలు సహజం. హెచ్చరికలూ సహజమే.! మీడియాలో ఇలాంటి పదాల ప్రస్తావన ఎంతవరకు సబబు.?

సబబే.! ఎందుకంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న అవమానాలు అలాంటివి. విమర్శలంటే, సద్విమర్శలు అయి వుండాలి. కానీ, కువిమర్శలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేశారు.

అన్నిటినీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నారు. బలంగా నిలబడ్డారు, 100 శాతం స్ట్రైక్ రేట్‌తో సంచలన విజయాన్ని అందుకున్నారు.

Pawan Kalyan Surgical Strike.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్..

జనసేన పార్టీకి (Jana Sena Party) పవన్ కళ్యాణ్ (Jana Sena Chief Pawan Kalyan) చారిత్రక విజయాన్ని అందించారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించి, నేషనల్ మీడియా నుంచి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారాన్ని దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్.

ముఖ్యమంత్రి స్థాయిలో వున్న ఓ వ్యక్తి, రాజకీయ ప్రత్యర్థి వ్యక్తిగత జీవితం గురించి దుర్భాషలాడటం.. భార్యల్ని కార్లతో పోల్చడం.. ఇది అహంకారం కాకపోతే మరేమిటి.? అహాంకారానికి శిక్ష.. పాతాళానికి తొక్కేయడమే.!

Mudra369

ఇక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అదఃపాతాళానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొక్కేశారన్నది నిర్వివాదాంశం.

11 అసెంబ్లీ సీట్లు, 4 లోక్ సభ సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితమయ్యింది. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 లోక్ సభ సీట్లను సాధించిన సంగతి తెలిసిందే.

అహంకారం.. అంతమైంది.!

అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ, ప్రజల్ని భయపెట్టింది.. ప్రతిపక్షాల్ని తొక్కిపెట్టేందుకు ప్రయత్నించింది.

Pawan Kalyan Ys Jaganmohan Reddy Datta Putrudu
Pawan Kalyan Ys Jaganmohan Reddy Datta Putrudu

ఒకే ఒక్కడు.. వైసీపీ అరాచకాలకు ఎదురు నిలిచాడు. అతనే పవన్ కళ్యాణ్. ‘దత్త పుత్రుడు’ అనీ, ‘ప్యాకేజీ స్టార్’ అనీ, తననెంతగా విమర్శించినా.. ఆ పవన్ కళ్యాణ్, వైసీపీ కుట్రల్ని బలంగా తిప్పికొట్టాడు.

‘నెత్తి మీద కాలు వేసి, అదఃపాతాళానికి బలంగా తొక్కుతాం..’ అని నినదించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

అదఃపాతాళానికి తొక్కేసిన పవన్ కళ్యాణ్..

నిజంగానే, వైసీపీ అనే రక్కసిని అదఃపాతాళానికి తొక్కేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

‘పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్’ అనే విమర్శల్ని ఎదుర్కొన్న జనసేనాని, ‘100 శాతం స్ట్రైక్ రేట్‌తో దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డుని సృష్టించిన పవన్ కళ్యాణ్’ అనే ప్రశంసల్ని అందుకుంటున్నారు.

ఆయన శిఖరం.. ఆయన ముందర నువ్వెంత.. నీ బతుకెంత.? ఔను, జనసేన పార్టీ ముందు వైసీపీ ఇప్పుడెంత.? జనసేన పార్టీ విజయం ముందు, వైఎస్సార్సీపీ బతుకెంత.?

Mudra369

వైసీపీని తొక్కడమే కాదు, జనసేన పార్టీని ఆకాశమంత ఎత్తున నిలబెట్టగలిగారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ విజయం చారిత్రాత్మకం.!

ఇంకా సరిగ్గా చెప్పాలంటే, 100 శాతం స్ట్రైక్ రేట్‌తో జనసేనాని పవన్ కళ్యాణ్, వైసీపీ మీద సర్జికల్ స్ట్రైక్ చేశారనడం కరెక్ట్.

Digiqole Ad

Related post