Table of Contents
Bigg Boss Telugu Season 9 Hungama.. ప్రతి యేడాదీ ‘బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో’ ఓ ప్రసహనంగా మారిపోతోంది.
అక్కినేని నాగార్జున గత కొన్ని సీజన్లుగా ఈ బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోకి హోస్టింగ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్.! ఈసారి కొత్తదనం ఏంటంటే, ‘అగ్ని పరీక్ష’.! అది కూడా, సీజన్ ప్రారంభానికి ముందు.
ఆ ‘అగ్ని పరీక్ష’ కూడా ఓ ప్రసహనంగానే సాగింది. ఎట్టకేలకు, అసలు ‘షో’ షురూ అవబోతోంది. గత సీజన్లతో పోల్చితే, ఏమైనా ఈ కొత్త సీజన్ ‘కొత్తగా’ వుండబోతోందా.?
Bigg Boss Telugu Season 9 Hungama.. అగ్ని పరీక్షతో ఏం సాధించినట్లు.?
అగ్ని పరీక్ష పేరుతో, కొందరు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేశారు. ఇందు కోసం నవదీప్, బిందు మాధవి, అభి (బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు) న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
శ్రీముఖి (ఈమె కూడా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్) యాంకర్‌గా వ్యవహరించింది బిగ్ బాస్ అగ్ని పరీక్షకి. ఎవర్ని హౌస్‌లోకి పంపాలో, ముందే డిసైడ్ అయి, నిర్వహించిన అగ్ని పరీక్ష ఇది.
నిజానికి, బిగ్ బాస్ రియాల్టీ షో.. అంతా స్క్రిప్టెడ్.! ఓ పక్కా డైరెక్షన్ ప్రకారమే నడుస్తుంటుంది. కంటెస్టెంట్లు జస్ట్ నటిస్తారంతే.
చివర్లో టైటిల్ ఎవరికి ఇవ్వాలన్నది కూడా, బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు డిసైడ్ చేసేది కాదు. అది కూడా నిర్వాహకులే డిసైడ్ చేస్తారు. కాకపోతే, గొర్రెల్లా ప్రేక్షకులు ఓట్లేస్తారంతే.
కొత్త టాస్కులు ఏమైనా వుంటాయా.?
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో.. అనగానే, మొదటి సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకూ.. అవే టాస్కులు. వాటిల్లో కొత్తదనాన్ని ఆశిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
కొత్త సీజన్‌లో కూడా అవే పాత టాస్కులకి కంటెస్టెంట్లు ఫిక్సయిపోయి వుంటారు. ఇక, బిగ్ బాస్ వీక్షకుల సంగతి సరే సరి.
ఫేడౌటయిపోయిన కొందరు సినీ ప్రముఖుల్నీ, బుల్లి తెరపై సీరియళ్ళలో నటించే నటీనటుల్ని.. ఇలా కంటెస్టెంట్లుగా తీసుకురావడం కొత్తేమీ కాదు.
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తొమ్మిదో సీజన్ కోసం కూడా.. అదే పాత టెంప్లేట్ (కంటెస్టెంట్ల ఎంపికకు సంబంధించి) అమలు చేస్తున్నారు.
తొమ్మిదో సీజన్ కంటెస్టెంట్లు వీళ్ళేనా.?
సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామి, రీతూ చౌదరి, సంజన, అలేఖ్య చిట్టి పికెల్స్ రమ్య మోక్ష.. ఇలా కొన్ని పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి కంటెస్టెంట్లుగా. ఇందులో నిజమెంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
కంటెస్టెంట్లుగా తమ పేర్లు ఖరారైందన్న సమాచారం వచ్చినవాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారాలు మొదలెట్టేసుకున్నారు.
షరామామూలుగానే, వాళ్ళకి అభిమాన సంఘాలూ ఏర్పడిపోయాయి.. అవి చేయబోయే రచ్చ ఏంటో ముందు ముందు చూడబోతున్నాం.