Bigg Boss Telugu Sivaji.. బిగ్ బాస్ రియాల్టీ షోకి ఎందుకొచ్చావ్.? అని ప్రశ్నిస్తే, ‘నేనెప్పుడూ జైలుకి వెళ్ళలేదు.. ఇక్కడ కంటెస్టెంట్ల పరిస్థితి అదే. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసమే..’ అని సెలవిచ్చాడు సినీ నటుడు శివాజీ.!
సినీ నటుడు శివాజీ.. సినీ నిర్మాత శివాజీ.. వీటికంటే కూడా, ‘గరుడ పురుణం’ శివాజీ అంటే, తెలుగు నేలపై ఠక్కున గుర్తుపడతారు.
‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శివాజీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రత్యేక హోదా కోసం పోరాడేశాడు.. నానా యాగీ చేసేశాడు.
Bigg Boss Telugu Sivaji.. బిగ్ బాస్ హౌస్‌లో తేలాడేంటబ్బా.?
టీవీ9 రవి ప్రకాష్‌కి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించడమే కాదు, టీవీ9 సంస్థలో కొంత వాటా కూడా ఆయన అప్పట్లో పొందాడన్న ప్రచారం జరిగింది.
ఓ దశలో, శివాజీ.. విదేశాలకు వెళ్ళేందుకు న్యాయస్థానాల అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అంతలా లీగల్ చిక్కుల్లో ఇరుక్కుపోయాడు శివాజీ.
సినిమాల్లో ఛాన్సులు లేక, మీడియాలోనూ ఎవరూ తనను పట్టించుకోలేక, రాజకీయాల్లోనూ అనాధగా మారిపోయి.. కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడీయన
.
చివరికి.. బిగ్ బాస్ హౌస్‌లో తేలాడు. ముందు పొట్ట.. వెనకాల డాష్.. అంటూ నాగార్జున ముందర ఓ చెత్త డైలాగు వేశాడు లెండి.!
నోరేసుకుని పడిపోవడమే..
బిగ్ బాస్ హౌస్‌లో ఎలా మేనేజ్ చేస్తావ్.? అనడిగితే, నోరేసుకుని పడిపోవడమే.. అని అసలు విషయం చెప్పకనే చెప్పేశాడు శివాజీ.
ఇంతకీ, బిగ్ బాస్ హౌస్‌లో శివాజీ ఏం చేయబోతున్నాడు.. ఈ రియాల్టీ షో ద్వారా ఏం సాధించబోతున్నాడు.?
Also Read: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.! ఇదెలా సాధ్యం.?
మొదటి వారమే వికెట్ పడిపోతుందో.. ఓ నాలుగైదు వారాలు హౌస్‌లో వుంటాడో.! అంతే, అంతకు మించి అయితే శివాజీకి సీన్ లేదు.!
బయట చేసిన రాజకీయాల తాలూకు అనుభవం, బహుశా బిగ్ బాస్ (Bigg Boss Telugu) రియాల్టీ షోలో శివాజీకి బాగా ఉపయోగపడతాయేమో.!