BiggBossTelugu9 Aysha.. ఫైర్‌స్టార్మ్.. అంటూ, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. జరిగిపోయాయ్.! పికెల్స్ రమ్య సహా పలువురు కంటెస్టెంట్లు ఫుల్ ఎనర్జీతో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళారు కూడా.
దివ్వెల మాధురి, సాయి, నిఖిల్.. తదితరులు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఈ లిస్టులో మరో ఎనర్జిటిక్ క్యారెక్టర్ కూడా వుంది.
ఆమె ఎవరో కాదు. ఐషా.! పూర్తి పేరు అయేషా జీనత్ బీవీ.! కేరళ కుట్టి.! పుట్టింది కేరళలో అయినా, ఎక్కువగా తమిళనాట పాపులర్ అయ్యింది ఐషా అలియాస్ అయేషా జీనత్.
ఐషాకి, బిగ్ బాస్ ఇంతకు ముందే బాగా పరిచయం. ఏకంగా 63 రోజులు బిగ్ హౌస్‌లో వుందామె. కాకపోతే, అది తెలుగు బిగ్ బాస్ కాదు, తమిళ బిగ్ బాస్.!
BiggBossTelugu9 Aysha.. గ్లామరస్ కంచు..
బిగ్ బాస్ హౌస్‌లో 63 రోజులు వుండటమంటే, కంటెస్టెంట్‌లో ఎంత స్టామినా వుండాలి.? ఔను, ఐషా అంటే, చాలా ఎనర్జిటిక్.

ఆ విషయం నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో, ఐషా ఎంట్రీతోనే అందరికీ అర్థమయిపోయింది. కేరళ కుటి, తమిళనాడులో పాపులర్ అయన ఐషా, తెలుగులో ఎలా గలగలా మాట్లాడేస్తోందిట.?
ఎందుకంటే, తెలుగులో కొన్ని టీవీ సీరియల్స్ చేసింది ఐషా. రెండు టీవీ సీరియల్స్ ‘స్టార్ మా’లోనే చేసేసిందీ ఐషా. అద్గదీ సంగతి. అలా, ఆమెకు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ తేలికైందన్నమాట.
కప్పు కొట్టేస్తుందా.?
కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించింది.. అలానే, కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ, సినిమాల్లోనూ ఐషా నటించడం గమనార్హం. బాగా సౌండ్ పార్టీ.. అనే ప్రచారమూ జరుగుతోంది.

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, తొమ్మిదో సీజన్.. చాలా అంటే, చాలా చాలా చప్పగా సాగుతూ వచ్చింది ఇప్పటిదాకా. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో హౌస్‌లో ఒకింత జోష్ వచ్చినట్లు కనిపిస్తోంది.
Also Read: బిగ్ క్వశ్చన్.! మీ బిర్యానీలో ‘చికెన్’ వుందా.?
చూద్దాం.. వైల్డ్ కార్డ్‌గా వచ్చినా, కప్పు కొట్టేస్తానంటున్న ఐషా, ఈ షోకి ఏ స్థాయి ఎనర్జీ ఇస్తుందో.! ఆమె గ్లామర్ ఈ షోకి, ఎంత వర్కవుట్ అవుతుందో.!
