BiggBossTelugu9 Rithu Chowdary Crying.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తొమ్మిదో సీజన్‌లో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించిన రచ్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
ఓ వైపు వైల్డ్ కార్డ్ హంగామా నడుస్తోంటే, ఇంకో వైపు రీతూ చౌదరి ఏడుపు గురించిన ట్రోలింగ్.. సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది.!
హౌస్ మేట్స్ అన్నాక, బిగ్ బాస్ చెప్పినట్లు ‘బాండింగ్స్’ ఏర్పరచుకోవాల్సిందే. ఎవరు ఎవరితో కనెక్ట్ అవ్వాలో, బిగ్ బాస్ చెబుతాడు.
బిగ్ హౌస్‌లో కంటెస్టెంట్స్ అంతా, బిగ్ బాస్ చెప్పినట్లు నటించాల్సిందే. సరిగ్గా నటించకపోతే, హౌస్ నుంచి ఎలిమినేట్ చేసి పారేస్తాడు బిగ్ బాస్.
మరి, ఓటింగ్ ఏంటి.? ఈ సోషల్ ట్రోలింగ్ ఏంటి.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ. అంతిమంగా, బిగ్ బాస్ రియాల్టీ షో అంటేనే, రియాల్టీ లేని షో.!
BiggBossTelugu9 Rithu Chowdary Crying.. రీతూ చౌదరి ఎందుకు ఏడ్చింది.?
వీకెండ్ ఎపిసోడ్.. ఎలిమినేషన్ జరగనుంది. ఇద్దరి మధ్య ఫైనల్ కౌంట్ డౌన్ షురూ అయ్యింది. ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి.
హౌస్‌లో సంజనతో తనకున్న బాండింగ్ నేపత్యంలో, ఒకవేళ తాను ఎలిమినేట్ అయితే సంజనని మిస్ అవుతానని, ఓ ప్రశ్నకు బదులిచ్చింది ఫ్లోరా సైనీ.
ఇక, రీతూ చౌదరి అయితే పవన్ పేరు చెప్పింది. పవన్ అంటే, డిమాన్ పవన్.! వలవలా ఏడ్చేసింది రీతౌ చౌదరి, డిమోన్ పవన్‌ని మిస్ అవడం గురించి.
Also Read: నాగార్జున, టబు.. ఇంకోస్సారి జతకడితే ఆ కిక్కే వేరప్పా.!
మరీ, అంతలా ఏడవడానికి ఏముంటుంది.? ఫ్లోరా సైనీ అంటే, హైద్రాబాదీ కాదు.. తెలుగమ్మాయి అసలే కాదు. ముంబై నుంచి బెంగళూరు వెళ్ళి, సంజనని కలవడం కష్టం.
రీతౌ చౌదరి, డీమాన్ పవన్ విషయంలో అలా కాదు కదా.! షో ముగిశాక, ఇద్దరూ కలుసుకోవచ్చు.. ఒకవేళ ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యా నడుస్తున్న కెమిస్ట్రీ నిజమే అయితే.!
అసలంటూ, బిగ్ బాస్ హౌస్‌లో ఏడుపులంటేనే, చాలామంది వ్యూయర్స్‌కి అసహస్యం. సీరియల్స్‌లో ఏడుపులు చూడలేక, బిగ్ బాస్‌ని ఎంటర్టైన్మెంట్‌గా కొందరు బుల్లితెర వీక్షకులు భావిస్తుంటారు.
దురదృష్టం ఏంటంటే, బిగ్ బాస్ ఇంట్లో కూడా అవే ఏడుపులు.. కాదు కాదు, సీరియల్స్‌కి మించి ఏడుపులు.! అందునా, రీతూ చౌదరి ఏడుస్తోంటే, మరింత చిరాగ్గా వుంటోంది.
ఇదంతా, బిగ్ బాస్ ప్రోమో ఏడుపు వ్యవహారమే.! ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే, అందులో ఏడుపు వేరే లెవల్‌లో వుండబోతోంది. గెట్ రెడీ ఫర్.. రీతూ చౌదరి ఏడుపు.!
అయినా, రీతూ చౌదరికి.. గ్లామర్ పరంగా సోషల్ మీడియాలో కాస్తో కూస్తో ఫాలోయింగ్ వుంది. ఆ గ్లామర్‌ని వాడుకోవడం మానేసి, ఏడుపుగొట్టు డ్రామాలేంటి బిగ్ బాస్.!
