Biggest Shivalingam On Earth.. మన సనాతన ధర్మంలో శివాలయాలకు ప్రత్యేక స్థానం వుంది. కొన్ని శివాలయాలూ.. వాటి స్థల పురాణాలూ ఇప్పటికీ మిస్టరీగానే వుంటూ వచ్చాయ్.
అలాంటి ఓ శివలింగం గురించి ఇప్పుడు మనం ప్రస్థావించుకుంటున్నాం. ఇంతకీ, ఇదెక్కడుందో తెలుసా.?
అరుణాచల్ ప్రదేశ్‌లోని జీరో ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో కర్ధావ్ కొండపైన వుందీ శివ లింగం. ఈ శివలింగం కొలువు దీరిన సిద్ధేశ్వర్ నాధ్ శివాలయం ప్రత్యేకత గురించి తెలుసుకుని తీరాల్సిందే.
ఇప్పటికే చాలా ఎత్తయిన శివలింగాల గురించి విని వుంటాం. అలాంటివాటిల్లో ఒకటి మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ వుంది.
ఆంధ్ర ప్రదేశ్‌లోని రావి వలసలో ఓ ఎత్తైన శివ లింగం వుంటుంది. ఎండల మల్లేశ్వర స్వామిగా ఈ శివలింగాన్ని పిలుస్తుంటారు.
ఎత్తు ఇరవై అడుగుల పైనే వుంటుంది. ఓ మారుమూల గ్రామంలో ఈ శివాలయం కొలువుదీరింది.
Biggest Shivalingam On Earth.. ప్రకృతి ఒడిలో పరమ శివుడు..
అచ్చం ఇదే శివ లింగాన్ని పోలినట్లున్న అరుణాచల ప్రదేశ్‌లోని సిద్ధేశ్వరనాధ్ శివలింగం తాజాగా వెలుగులోకి వచ్చింది.
2004లో ఈ శివ లింగాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ శివ లింగం గురించిన ప్రస్థావన పురాణాల్లోనూ వున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
25 అడుగుల ఎత్తున్న ఈ నిలువెత్తు శివ లింగాన్ని దర్శిస్తే నిజంగానే సర్వ పాపాలు హరించిపోతాయనిపిస్తుంది.
చుట్టూ పచ్చని ప్రకృతి. ఆ మధ్యలో అంత ఎత్తయిన శివ లింగం.. చూసేందుకు రెండు కళ్లూ చాలవంతే.. అనేలా ఈ దృశ్యం ఘోచరిస్తుంది.
ప్రత్యేకత ఏంటంటే..!
సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ శివ లింగం అడుగు భాగంలో నిరంతరం నీరు ప్రవహిస్తుంటుంది. ఈ నీటి ప్రవాహాన్ని ‘గంగా దేవి’గా అభివర్ణిస్తారు.
ఈ శివలింగం గురించి ఓ ఆసక్తికరమైన కథనాన్ని అక్కడి స్థానికులు చెబుతున్నారు. 2004లో ఓ నేపాలీ వ్యక్తి ఇక్కడికి కట్టెలు కొట్టుకునేందుకు వచ్చాడట.
ఓ పెద్ద చెట్టు నుంచి కట్టెలు కొడుతుండగా.. ఆ కట్టెలు పక్కనే వున్న ఓ పెద్ద కొండపై పడతాయ్ కదా.. అనుకున్నాడట.
Also Read: చెవికో నగ.! అదిరెను అందాల సెగ.!
కానీ, చెట్టు నుంచి విరిగి పడిన కట్టెలు పక్కనే వున్న ఆ కొండపై కాకుండా.. దూరంగా వెళ్లి పడడం చూసి విస్తుపోయాడట.
కాసేపు ఆలోచించి చూడగా.. ఆ కొండకు ఏదో ప్రత్యేకమైన శక్తి వుందని ఊరి జనాలకు చెప్పగా.. అలా ఈ శివ లింగం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ శివ లింగం ఎత్తు 25 అడుగులు. సిద్ధేశ్వర నాధ్ శివ లింగం ప్రపంచంలోనే అంత ప్రత్యేకమైనదిగా గుర్తింపు దక్కించుకుంది.
పెరిగిన సోషల్ మీడియా కల్చర్‌తో ఈ శివ లింగానికి మరింత పాపులారిటీ దక్కింది.
పలువురు సినిమా స్టార్లతో పాటూ.. ప్రకృతి ప్రేమికులు ఈ అందమైన శివ లింగాన్ని దర్శించుకుని.. అక్కడి ప్రకృతిని ఆస్వాదించేందుకు ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నారు.
