Bindu Madhavi Bigg Boss.. బిగ్ బాస్ రియాల్టీ షో విన్నర్ అవ్వాలనే కోరిక బిందు మాధవికి తమిళంలో నెరవేరలేదుగానీ, తెలుగులో నెరవేరింది.
తెలుగమ్మాయ్ కదా.! అందుకే, తెలుగు సినిమాల్లో (Tollywood) ఆమెకు సక్సెస్ వచ్చినాగానీ, దర్శక నిర్మాతలు మొహం చాటేశారు. దాంతో, చెన్నయ్ చెక్కేసి.. అక్కడ బాగానే అవకాశాలు దక్కించుకుంది.
తమిళ బిగ్‌బాస్‌లో (Bigg Boss) టైటిల్ రేసులోకి వచ్చినట్టే వచ్చి, చేజార్చుకున్న బిందు మాధవికి, తెలుగు బిగ్ బాస్‌లో (Bigg Boss Non Stop) మాత్రం బంపర్ విక్టరీ కొట్టింది.
బిందు మాధవి క్రేజ్.. ఆ కిక్కే వేరప్పా.!
బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Non Stop) సీజన్ ముగిసి రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నా బిందు మాధవికి క్రేజ్ తగ్గలేదు. ఇంతలోనే, కొత్త సీజన్ బిగ్ బాస్ తెలుగు వచ్చేస్తోంది.
ఆరో సీజన్ (Bigg Boss Telugu 6) కోసం ఏర్పాట్లు షురూ అవుతుండగానే, బిందు మాధవి పేరు మళ్ళీ తెరపైకొచ్చింది.
ఇంకోసారి బిగ్ హౌస్‌లోకి బిందు మాధవి (Bindu Madhavi) అడుగు పెట్టాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.

ప్చ్.! అది సాధ్యమయ్యే పని కాకపోవచ్చు. ఆమెకు (Bindu Madhavi) ఆ ఇంట్రెస్ట్ వున్నట్లు కూడా కనిపించడంలేదు.
ఏమో, గెస్ట్ ఎంట్రీ అయినా బిందు మాధవి (Bindu Madhavi) ఇస్తుందేమో.. అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Bindu Madhavi Bigg Boss ఔనా.? కాదా.?
బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Non Stop) పరమ రోతగా తయారైన విషయం విదితమే. అయితే, ఇందులో బిందు మాధవి అప్పీయరెన్స్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. బహుశా అదే ఆమెకు కిరీటాన్ని అందించిందేమో.!
Also Read: ప్రేమ కథ.. పెళ్ళి వ్యధ.! వెళ్ళిపోమాకె.. నన్నొదిలి.!
ఇంతకీ, కొత్త సీజన్‌లోకి (Bigg Boss Telugu) బిందు మాధవి ఏ రూపంలో అయినా ఎంట్రీ ఇస్తుందా.? ఇవ్వదా.? అదైతే, ప్రస్తుతానికి సస్పెన్స్.!