Bindu Madhavi Bigg Queen.. తాజాగా బుల్లితెరపై బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ స్టార్ట్ అయ్యింది.
అయితే, ఈ సందర్భంగా మళ్లీ గత సీజన్ విన్నర్ అయిన బిందు మాధవి ట్రెండింగ్‌లోకి వచ్చింది. అసలు బిందు మాధవి ట్రెండింగ్ నుంచి తప్పుకుంటేగా.!
బిగ్‌బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Non Stop) పేరుతో ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్ షోకి సంబంధించి బిందు మాధవి క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.
టీవీల్లో ఈ షో ప్రసారం కాలేదు కానీ, ఒకవేళ అయ్యుంటే ఆ లెవల్ ఇంకే స్థాయిలో వుండేదో.
అయితేనేం, బిగ్‌బాస్ (Bigg Boss Telugu) చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించింది బిందు మాధవి. బిగ్‌బాస్ ‘క్వీన్’గా బిందు మాధవిని (Bindu Madhavi) నెటిజనం అభివర్ణించుకుంటున్నారు.
నిజమే బిగ్‌బాస్ క్వీనే మరి బిందు మాధవి. బిగ్‌బాస్ షోకి చాలా మంది విజేతలే వుండొచ్చుగాక. కానీ, లేడీ విన్నర్ మాత్రం వన్ అండ్ ఓన్లీ బిందు మాధవి.
Bindu Madhavi Bigg Queen.. బిందు మాధవి రూటే సెపరేటు.!
చాలా మంది మేల్ విజేతలకు రాని గుర్తింపు, పాపులారిటీ బిందు మాధవి దక్కించుకుంది. ఎవరికెంత పాపులారిటీ వున్నా, అది ఆ సీజన్ బిగ్‌బాస్ షో నడుస్తున్నంత సేపే.

కానీ, ఆ షో పూర్తయిపోయాకా, కొత్త సీజన్ స్టార్టయ్యాకా కూడా బిందు మాధవి మేనియా తగ్గలేదంటే అర్ధం చేసుకోవచ్చు ఆమె ఏ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుందో.
పదహారణాల తెలుగమ్మాయ్. తెలుగులోనే మొదట హీరోయిన్‌గా ట్రై చేసింది. తన వంతు రాణించింది కూడా. అయినా ఆమెను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత తమిళంలో అదృష్టం వరించింది. స్టార్ హీరోయిన్ అయ్యింది.
Also Read: అనసూయ ‘కర్మ’.! ‘అర్జున్ రెడ్డి’ పాపం ‘లైగర్’ని వెంటాడిందా.?
తమిళ బిగ్‌బాస్‌లోనూ బిందు మాధవి కంటెస్టెంట్‌గా గుర్తింపు దక్కించుకుంది. లాస్ట్ వీక్‌లో అనూహ్యంగా బయటికి వచ్చేసింది తమిళ బిగ్‌బాస్‌లో బిందు మాధవి.
తెలుగులో అలా కాదు, సివంగిలా పోరాడింది. చివరి వరకూ నమ్మకాన్ని వదిలి పెట్టలేదు. ఎట్టకేలకు ఆమెకి విజయాన్ని కట్టబెట్టారు తెలుగు ప్రేక్షకులు. దటీజ్ బిందు మాధవి.