Bindu Sensation BiggBoss Nonstop.. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ముగిసింది. బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు హిస్టరీలో తొలిసారిగా ఓ మహిళా కంటెస్టెంట్ విజేతగా నిలిచింది.
సినీ నటి బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేత అయ్యింది.
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్మించిన ‘ఆవకాయ్ బిర్యానీ’ సినిమాతో ఈ తెలుగమ్మాయ్ తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, తెలుగు తెరపై సహజంగానే తెలుగమ్మాయిల పట్ల చిన్న చూపు వుంటుంది. అదే బిందు మాధవి పాలిట శాపమైంది.
హిట్లు కొట్టినాగానీ, హీరోయిన్‌గా తెలుగునాట ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. తమిళ సినిమా ఆమెకు రెడ్ కార్పెట్ వేయడంతో అక్కడే నటిగా స్థిరపడింది.
Bindu Sensation BiggBoss Nonstop.. అక్కడే వెతుక్కుంది
కానీ, పోయిన చోటే వెతుక్కోవడం.. అన్న చందాన బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు రియాల్టీ షోతో మళ్ళీ తెలుగు నేలపై తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించింది, ఈ క్రమంలో సక్సెస్ అయ్యింది కూడా.
బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభమైనప్పటినుంచీ, బిందు మాధవి ఒకే ఆటిట్యూడ్‌తో కనిపించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎవరెంతలా తనను టార్గెట్ చేసినా, బిందు మాధవి స్ట్రెయిట్‌గా నిలబడిందే తప్ప, ఎవరికీ తలొగ్గలేదు.

‘బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆడపులి..’ అనే గుర్తింపు తెచ్చుకున్న బిందు మాధవికి, పెయిడ్ పీఆర్ బృందం ద్వారా వచ్చిన ఓట్లతోపాటుగా, ఆమెకు తమిళనాట వున్న అభిమానులు అండగా నిలిచారు.
ఓటీటీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ కంటెంట్ చూసిన తెలుగు వీక్షకులూ.. బిందు మాధవికి ‘జై’ కొట్టారు. ఓ దశలో బిందు మాధవి హౌస్‌లో వుండడం కష్టమేననే పరిస్థితులు ఏర్పడినా, ధైర్యంగా నిలబడిందామె.
అప్పుడూ.. ఇప్పుడూ ఒకేలా.!
హౌస్‌లోకి వచ్చినప్పుడెలా వుందో, హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా అదే హుందాతనం ఆమెలో కనిపించింది. బహుశా బిందు మాధవి సక్సెస్ సీక్రెట్ ఆ హుందాతనమేనేమో.!
ఒకానొక దశలో బిందు మాధవిని మిత్రా శర్మ తదితర కంటెస్టెంట్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కూడా.
ఆ క్రమంలో బిందు మాధవి సంయమనం కోల్పోయినట్లు కనిపించినా.. ఆమె అలా సంయమనం కోల్పోవడానికీ బలమైన కారణమే వుందని నిరూపించుకోగలిగింది.
Also Read: పాన్ ఇండియా పైత్యమా.! గౌరవం కాదు, అవమానమా.!
ఓవరాల్‌గా చూస్తే, ఈసారి బిగ్ బాస్ రియాల్టీ షోలో.. గెలవాల్సిన కంటెస్టెంట్‌నే నిర్వాహకులు గెలిపించడం గమనార్హం.
గతంలోలా, ఈసారి కూడా మేల్ కంటెస్టెంట్‌నే విన్నర్‌ని చేయాలనే రూల్ పెట్టుకోకపోవడాన్ని అభినందించాల్సిందే.
