బ్లాక్ వాటర్.. నీళ్ళు నల్లగా వుండటమేంటి.? మామూలుగా అయితే, చెరువు నీళ్ళు కలుషితమవడమో, లేదంటే నల్లా నీళ్ళు.. కలుషితమవడమో జరిగినప్పుడు.. ‘నలుపు రంగు’ లేదంటే, ఇతర రంగులు కనిపిస్తుంటాయి. కానీ, ఇవి చాలా స్వచ్ఛమైన నీళ్ళు.. కానీ, నల్లటి నీళ్ళు.. అదేనండీ బ్లాక్ వాటర్ (Black Water India).
క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ బ్లాక్ వాటర్ తాగుతాడట. సాధారణ మంచి నీటికి బదులు, మినరల్ వాటర్‌కి బదులు.. బ్లాక్ వాటర్ తాగటాన్ని అలవాటుగా చేసుకున్నాడు విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా. ఈ నీటి ధర 3 వేల రూపాయల వరకు వుంటుందట.. లీటర్ ధర మాత్రమేనండోయ్.
పలు పాశ్చాత్య దేశాల్లో సంపన్నులు ఈ బ్లాక్ వాటర్ తాగడం అలవాటుగా చేసుకున్నారు. కరోనా పాండమిక్ మొదలయ్యాక విరాట్ కోహ్లీ (Virat Kohli), ఈ బ్లాక్ వాటర్ తాగడం మొదలు పెట్టాడని అంటున్నారు. అదే బాటలో చాలామంది ప్రముఖులు బ్లాక్ వాటర్ తాగడం పట్ల ఆసక్తి పెంచుకున్నారు.
ఇంతకీ, బ్లాక్ వాటర్‌లో ఏముంటుంది.?
బ్లాక్ వాటర్.. సహజ సిద్ధమైన ఆల్కలైన్ కలిగి వుంటుందట. ఈ నీళ్ళు తాగినవారికి డీహైడ్రేషన్ సమస్యలు తగ్గుతాయట. మినరల్ వాటర్ అంటాంగానీ, అందులో అసలు మినరల్స్ వుండవు. అంతలా ప్యూరిఫై అయిపోతాయ్. కానీ, ఈ బ్లాక్ వాటర్.. చాలా రకాలైన మినరల్స్‌ని కలిగి వుంటుంది.
యాంటీ ఏజెంట్ గుణాలు ఈ బ్లాక్ వాటర్ ప్రత్యేకతల్లో మరొకటి. త్వరగా ముసలితనం వచ్చేయకుండా, చర్మం యవ్వనంగా వుండేలా చేస్తుందట ఈ నల్లనీరు.. అదేనండీ బ్లాక్ వాటర్. బహుశా అందుకేనేమో, అందాల భామలు ఊర్వశి రౌతెలా (Urvashi Rautela), మలైకా అరోరా తదితరులు ఈ బ్లాక్ వాటర్ పట్ల అమితమైన ప్రేమ చూపిస్తుంటారు.
మన దేశంలోనూ ఉత్పత్తి అవుతున్న Black Water
మనదేశంలో ఎవోకస్ పేరుతో బ్లాక్ వాటర్ అందుబాటులో వుంది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి వీటిని బుక్ చేసుకోవచ్చు. డిస్కౌంట్లు కూడా గట్టిగానే ఇస్తున్నారండోయ్. ఇక్కడ లభ్యమవుతున్న బ్లాక్ వాటర్ (Black Water India) ధర కాస్త బెటర్.. విదేశాలకు చెందిన బ్లాక్ వాటర్‌తో పోల్చితే.
మొత్తమ్మీ, మంచి నీళ్ళ యందు.. ఈ మరీ మంచి నీళ్ళు వేరయా.. అన్నట్లు.. మినరల్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే కాదండోయ్.. బ్లాక్ వాటర్.. అంతకు మించి అంటోందన్నమాట.