Home » చందమామ కాజల్ అగర్వాల్ చెప్పిన మాతృత్వం ముచ్చట్లేంటంటే.!

చందమామ కాజల్ అగర్వాల్ చెప్పిన మాతృత్వం ముచ్చట్లేంటంటే.!

by hellomudra
0 comments
Kajal Aggarwal

Kajal Aggarwal Pregnancy Tips.. గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాని హీటెక్కించే అందాల చందమామ కాజల్ అగర్వాల్, అకస్మాత్తుగా నెటిజన్లను షాక్‌కి గురి చేసింది. మాతృత్వం అందమైన అనుభూతి అనీ, ఆ అత్యద్భుతమైన అనుభూతిని పొందేందుకు చాలా ఉత్కంఠగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాననీ చెప్పింది కాజల్.

గర్భం దాల్చాక శరీరంలో వచ్చే మార్పుల గురించి అనేక ముచ్చట్లను నెటిజన్లతో పంచుకోవడమే కాదు, ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చక్కగా వివరించి చెప్పింది ఈ అందాల చందమామ.

మహిళ శరీర నిర్మాణం ఓ అద్భుతం.. అంటూ ఎత్తుకోవడంతోనే అమ్మతనాన్ని కాజల్ ఎంత గొప్పగా ఆస్వాదిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఓ జీవికి జన్మనిచ్చే అవకాశం మహిళకు దక్కడం ఇంకా అద్భుతం. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో వచ్చే మార్పులు కొంత ఇబ్బంది పెట్టొచ్చు. అయితే అవన్నీశరీరంలో బిడ్డ పెరగడానికి దోహదపడతాయి.. అంటూ కాజల్ (Kajal Agarwal) చెప్పుకొచ్చింది.

Kajal Aggarwal Pregnancy Tips చందమామ ప్రెగ్నెన్సీ పాఠాలు..

శరీరంలో జరిగే మార్పుల వల్ల కలిగే ఆనందాన్ని ఆస్వాదించాలి. అవన్నీ బిడ్డ పెరుగుదలకు సంకేతాలు.. అని అర్ధం చేసుకోవాలి. అలాగే, ప్రెగ్నెన్సీ సమయంలో ఆయా అనుభవాల్ని ఇతరులతో పంచుకోవాలి. జీవిత భాగస్వామితో మాట్లాడాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మధురానుభూతుల్నీ షేర్ చేసుకోవాలి. సమస్యల్నీ పంచుకోవాలి. మీలో మీరే కలత చెందితే ప్రమాదకరం.. అంటూ కాజల్ చెప్పింది.

ప్రతిరోజూ సాధారణ జీవితాన్ని గడిపే క్రమంలో అన్ని పనులూ చేసుకోవచ్చు. తేలికపాటి స్విమ్మింగ్ లేదా నడక శరీరానికి కొత్త ఉత్తేజాన్నిస్తుంది. ప్రీనాటల్ యోగా చేయడం మంచిది. అయితే, వైద్యుల సలహా తప్పని సరి. యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీరం తేలికపడుతుంది. మనసుకీ, శరీరానికీ మధ్య కమ్యూనికేషన్ కోసం యోగా ఉపయోగపడుతుంది.

తన అనుభవాలకు వైద్యుని సలహాలు జోడించి..

అవసరమైతే, మసాజ్ చేయించుకోండి. ఇది కూడా వైద్యుల సలహా మేరకే చేయించుకోవాలి. ఒత్తడిని తగ్గిస్తుంది. ఆందోళనని దూరం పెడుతుంది.

ప్రెగ్నెన్సీ గురించి వీలైనంత ఎక్కువ సమాచారం తెలుసుకుంటూ వుండండి. మిమ్మల్ని మీరు ప్రెగ్నెన్సీ విషయంలో విద్యావంతుల్ని చేసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా శరీరంలో వచ్చే ఏ మార్పునీ చూసి ఆందోళన చెందాల్సిన పని వుండదు.

అవసరమైతే మానసిక వైద్యుల సలహా తీసుకోవాలి. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. ఇది మీకోసం, మీ బిడ్డ కోసం చేస్తున్నది.. అంటూ కాజల్ (Kajal Aggarwal) ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, ప్రెగ్నెంట్ అయిన మహిళ తనను తాను ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలనే టిప్స్‌ని పూస గుచ్చినట్లు వివరించింది.

Also Read: సర్వరోగ నివారిణి ‘గాడిద గుడ్డు’.. ఔనా.?

దీన్ని పబ్లిసిటీ కోణంలో చూడగలమా.? సెలబ్రిటీ గనుక, తాను చెప్పే మంచి విషయాలు ఎక్కువమందికి చేరతాయనీ, తద్వారా ఎవరైనా ప్రెగ్నెన్సీ పట్ల అపోహలతో ఇబ్బంది పడితే, అలాంటివారికి తానిచ్చే సమాచారం ఉపయోగపడుతుందని కాజల్ అగర్వాల్ భావించి వుండొచ్చు.

ఏదైనా అనుభవంతో చెబితే ఆ లెక్కే వేరు. కాజల్ తన అనుభవాల్ని రంగరించి మహిళ జీవితంలో తల్లి కావడం అనే ఓ అపురూపమైన ఘట్టాన్ని తన సొంత మాటలతో ఇలా చెప్పుకొచ్చింది. కాజల్ (Kajal Aggarwal Pregnancy Tips) చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు నెటిజన్లు. హ్యాట్సాఫ్ టు యు కాజల్ అగర్వాల్.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group