Bloody Mary Telugu Review.. ఇద్దరు అనాధలు. వారిలో ఒకరికి వినబడదు. ఇంకొకరు మాట్లాడలేరు. వారిద్దరినీ చూసుకునే ఓ అమ్మాయికి సరిగ్గా కనబడదు.
కానీ, ఆ అమ్మాయి మైండ్ చాలా షార్ప్. రెండు హత్యలు.. అందులో ఒకటి ఆ అమ్మాయి చేసింది. ఇంకొకటి మూగబ్బాయ్ చూసింది.
ఓ హత్య తాలూకు వీడియో చెవిటి వాడికి దొరికింది. ఓ పోలీసాఫీసర్, మనుషుల్ని చంపేసి అవయవాల్ని అమ్మేసే నరరూప రాక్షసుడు. ఇవీ ‘బ్లడీ మేరీ’ లో పాత్రల వ్యవహారం.
మూగవాడినీ, చెవిటి వాడినీ సాకే అమ్మాయి నివేదా పేతురాజ్. పోలీసాఫీసర్ అజయ్. కరడు కట్టిన విలన్ బ్రహ్మాజీ. కామెడీ కాస్తా ఎమోషన్‌తో స్టార్ట్ అయ్యి కామెడీగా నడుస్తూ, థ్రిల్ ఇస్తుంది ఈ ‘బ్లడీ మేరీ’.
Bloody Mary Telugu Review.. సహజత్వానికి దూరంగా..
సహజత్వానికి దూరంగా పాత్రలు, కథనం నడుస్తూ వెళుతుంది. హాస్పిటల్‌లో డాక్టర్‌ని ఓ నర్సు చంపేస్తే, ఎవరు చంపారో తెలియనంత అమాయకత్వం.. ఇలా కొన్ని లోపాలున్నాయ్.
కానీ, ఇప్పుడొస్తున్న చాలా సినిమాలతో పోలిస్తే, ఓటీటీ కంటెంట్ వందల రెట్లు, వేల రెట్లు బెటర్. క్వాలిటీ బావుంటోంది.
మ్యూజిక్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు.. నటీనటుల నటనా ప్రతిభ కావచ్చు.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావచ్చు.. ఓటీటీ కంటెంట్‌లో బావుంటున్నాయ్.
‘బ్లడీ మేరీ’ విషయంలో కొన్ని లోపాలున్నా ఓవరాల్‌గా టైమ్ పాస్ థ్రిల్లింగ్ కంటెంట్ ఇది. నివేదా పేతురాజ్ చాలా బాగా చేసింది. అజయ్, బ్రహ్మాజీ తమ పాత్రల్లో మెప్సిస్తారు. ఏ పాత్రకి ఆ పాత్ర తమ పని చక్కగా చేసుకుపోయారు.
అలా ఎలా ఎదిగిపోతారబ్బా.?
అసాధారణ ఆలోచనలోనే వున్నా, ఓ సామ్రాజ్యాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకునే స్థాయికి ఇందులో ప్రధాన పాత్రధారి ఎదిగిపోవడం.. అంతగా ఆకట్టుకోదు.
హీరోల విషయంలో ఎలివేషన్ సీన్స్ ఏ స్థాయికి వెళ్లినా బాగానే ఉంటున్న రోజులివి. ఏం.! హీరోయిన్లకేం తక్కువ.?
Also Read: పెళ్లి.! జరగాలి మళ్లీ మళ్లీ మళ్లీ..!
నివేదా (Nivetha Pethuraj) క్యారెక్టర్‌ని ఇంకాస్త స్ట్రాంగ్‌గా తీర్చి దిద్ది వుంటే, జస్టిఫికేషన్ సరిగ్గా ఇచ్చి వుండి వుంటే, నిజంగానే బెస్ట్ కంటెంట్ అనగలిగేవాళ్లం.
అన్నట్టు, ‘పుష్ప ది రైజ్’ తరహాలో, ‘బ్లడ్ మేరీ’ని కూడా ‘ది రైజ్’ అంటూ ముగించారు. అంటే, ‘ది రూల్’ కూడా వుండబోతోందన్నమాట.