Table of Contents
Brahmastra FDFS. ఈ బాలీవుడ్‌కి ఏమయ్యింది.? గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో ఎందుకు బాలీవుడ్ సతమతమవుతోంది.?
ప్రతి సినిమా విషయంలోనూ ‘బాయ్‌కాట్’ అనే నినాదం సర్వసాధారణమైపోయింది బాలీవుడ్‌లో.! అదే దాదాపు అన్ని సినిమాల్నీ నాశనం చేసేస్తోంది.
భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి కూడా అదే తలనొప్పి ఎదురయ్యింది.
Brahmastra FDFS.. ఫస్ట్ డే ఫస్ట్ షో.. దారుణం.!
‘బ్రహ్మాస్త్ర’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫ్లాపులపై బ్రహ్మాస్త్రం.. అంటూ ప్రచారం జరిగింది. కానీ, సినిమా మీద విపరీతమైన నెగెటివ్ టాక్ ప్రచారంలోకి వచ్చేసింది.
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాకి టూ ప్లస్ రివ్యూలే కనిపించడంలేదు. ముందస్తు రివ్యూలలో వచ్చిన బ్యాడ్ టాక్, సినిమా విడుదలయ్యాక కూడా కొనసాగుతోంది.
ఇలాగైతే ఎలా.?
వచ్చిన సినిమా వచ్చినట్లే నాశనమైపోతోంటే, బాలీవుడ్ కోలుకునేదెలా.? ఫ్లాపులు బాలీవుడ్‌లోనే కాదు, సౌత్‌లో కూడా వస్తున్నాయ్. కానీ, బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణం.

అసలు ఇప్పట్లో బాలీవుడ్ కోలుకునే అవకాశాలే కనిపించడంలేదు. దీనికి కారణమేంటి.? అంటే, ఎవరికి తోచిన కారణం వారు చెబుతున్నారు.
‘బ్రహ్మాస్త్ర’ విషయానికొస్తే, పబ్లిసిటీ పీక్స్‌లో వుంటే, కంటెంట్ పరమ వీక్‌గా వుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఫాఫం అలియా భట్..
గర్భిణిగా వున్నఅలియా, ఆపసోపాలు పడుతూనే ‘బ్రహ్మాస్త్ర’ సినిమా పబ్లిసిటీ కోసం పని చేసింది. ప్చ్.. ఆమెది వృధా ప్రయాసగానే మిగిలిపోయిందని అనుకోవాలేమో.!
జక్కన్న రాజమౌళి కూడా ఈ సినిమా పబ్లిసిటీ కోసం చాలా చాలా కష్టపడ్డాడు. తెలుగు వెర్షన్‌కి ఆయనే సమర్పకుడు. అన్నట్టు, అక్కినేని నాగార్జున ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
Also Read: అభిమానులు వద్దంటున్నా.. ‘డార్లింగ్’ ప్రభాస్ వినడే.!
బిగ్ బి అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటించాడు.
ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్‌తో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ ఇంతలా తొలిరోజే నిరసించిపోవడం ఒకింత ఆశ్చర్యకరం.
అన్నట్టు, ఇది ఫస్ట్ పార్ట్ సుమీ.! రెండో పార్ట్ తీయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చనేంతలా నెగెటివ్ టాక్ వినిపిస్తోంది.