తీరంలో కెరటాలు పోటెత్తుతాయ్.. అంటూ ఓ సినిమాలో ప్రబాస్ పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు ప్రబాస్ అంటే వసూళ్లు పోటెత్తుతాయ్.. అని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. ‘బాహుబలి’ సినిమాతో కింగ్ ఆఫ్ ఇండియన్ బాక్సాఫీస్ అనిపించుకున్న ప్రబాస్ ఇప్పుడు ‘సాహో’ (Saaho Review) సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌పై వసూళ్ల దండయాత్ర షురూ చేశాడు.
‘రన్ రాజా రన్’ అనే ఒక్క సినిమాకి దర్శకత్వం వహించిన సుజిత్‌ని ఇంతటి భారీ చిత్రానికి దర్శకుడిగా ఎంచుకోవడంలోనే ప్రబాస్ తన రేంజ్ ఏంటన్నది నిరూపించేశాడు. నిజానికి ‘సాహో’ సినిమాని మొదట మరీ ఇంత పెద్దగా అనుకోలేదట. కథ, కథ కోసం రాసుకున్న సన్నివేశాలు అలా అలా సినిమా రేంజ్‌ని పెంచుకుంటూ వెళ్లిపోయాయట.
Click Here: ‘సాహో’ ఫస్ట్ రివ్యూ: ‘బాహుబలి’ రికార్డులు ఔట్.?
సన్నివేశాల్లో, బలాన్ని బట్టే, సినిమా కోసం నిర్మాతలు ఖర్చు పెట్టారనీ, కావాలని చేసిన ఖర్చేమీ లేదని ప్రబాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మరోపక్క, డబ్బు గురించి ఆలోచిస్తే, నిర్మాతలు వంద కోట్లు మిగుల్చుకునేవాళ్లనీ, ఓ గొప్ప సినిమా ఇవ్వాలన్న తపనే ఈ రోజు ‘సాహో’ని (Saaho Review) ఇంత పెద్దగా మార్చేసిందని ప్రబాస్ చెప్పాడు.
ప్రమోషన్స్ మొదలయ్యాక, డే వన్ నుండి సినిమా రిలీజ్ వరకూ ఎక్కడా ప్రబాస్ హద్దులు దాటి మాట్లాడలేదు. 300 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్‌లో హీరోగా నటించిన అహంకారం ప్రబాస్‌లో లేదు. కష్టపడి సినిమా చేశాం.. అని చెప్పాడంతే. కష్టానికి తగిన ఫలితం వస్తుందంటున్నాడు. ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేసి తీరతామని భరోసా ఇస్తున్నాడు.
Click Here: Jacqueline’s Hot Show For ‘Bad Boy’ Saaho!
‘బాహుబలి’తో పోల్చొద్దు అంటూనే, ‘బాహుబలి’ ఫ్యాన్స్‌ని అలరిస్తుందంటూ, సినిమా రేంజ్‌ని పరోక్షంగా ప్రస్థావించాడు ప్రభాస్. ఇక బాక్సాఫీస్ అంచనాలెలా ఉన్నాయన్న విషయానికి వస్తే, అంచనాలు ఎప్పుడో ఆకాశం అంచుల్ని తాకేశాయి. అడ్వాన్స్ బుకింగ్ ఇలా ప్రారంభమయ్యిందో లేదో అలా హాట్ కేక్స్‌లా టికెట్స్ అమ్ముడయిపోయాయి.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్స్ అన్నీ, దాదాపుగా ‘సాహో’కి (Saaho Review) సలాం కొట్టేసినట్లే. కనీ వినీ ఎరుగని స్థాయిలో భారీ రిలీజ్‌కి ‘సాహో’ సిద్ధమైంది. తొలి రోజు వసూళ్లతో అన్ని భాషల్లోనూ, ‘బాహుబలి’ రికార్డుల్ని ‘సాహో’ తిరగరాస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
300 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్న ‘సాహో’ ఏ స్థాయి వసూళ్లని కొల్లగొడుతుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. 100 కోట్లు, 200 కోట్లు.. అనే అంచనాల్లేవ్. కొడితే, కుంభస్థలం కొట్టాల్సిందే. ‘బాహుబలి’ రికార్డులు గల్లంతవుతాయా.? లేదా.? అన్నదే ఇక్కడ చర్చ. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్‌లోనూ అభిమానులు పోటెత్తుతున్నారు.
ఇక బాక్సాఫీస్ వద్ద వసూళ్లు పోటెత్తడమే తరువాయి. గల్ఫ్ దేశాల నుండి, ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ (Saaho Review) బయటికి వచ్చేసింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ గురించిన హంగామా అప్పుడే పీక్స్‌కి చేరిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశమంతా ఇప్పుడు ‘సాహో’ గురించిన చర్చే జరుగుతోంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ‘సాహో’ వసూళ్ల సునామీ.