Bro First Review.. ఫస్ట్ రివ్యూ.. ఫస్ట్ రివ్యూ.. ఫస్ట్ రివ్యూ.! ‘బ్రో’ సినిమాకి సంబంధించి అప్పుడే ఈ ‘ఫస్ట్ రివ్యూ’ ఓ రేంజ్‌లో ప్రాచుర్యంలోకి వచ్చేసింది.
ఎవరు చూశారు.? ఎక్కడ చూశారు.? అసలేంటి కథ.? ఫస్ట్ రివ్యూ ప్రకారం చూస్తే, బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది.!
హీరో ఓ గొప్పింటోడు.. తండ్రి అకాలమరణంతో, కంపెనీ బాధ్యతలు భుజాన వేసుకుని, క్షణం తీరిక లేక హైరానా పడుతుంటాడు.! ఆ పాత్రలో కనిపించనున్నాడు సాయి ధరమ్ తేజ్.
దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురవుతాడు హీరో సాయి ధరమ్ తేజ్.! ప్రాణాలు కోల్పోతాడు కూడా. ఆ హీరోకి ‘టైమ్’ దేవుడి రూపంలో ఎదురుపడతాడు పవన్ కళ్యాణ్.!
టైమ్ దేవుడికి, హీరో సమయం అడగడం.. కొన్నాళ్ళు గడువు ఇవ్వడం కూడా జరిగిపోతుంది.
ఆ టైమ్ తీసుకున్న హీరో, తన కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్ని ఎలా చక్కబెట్టాడన్నది మిగతా కథ.!
Bro First Review.. మార్పులు.. చేర్పులు.!
‘వినోదయ సితం’ సినిమా నుంచి చిన్నా చితకా కాదు.. పెద్ద మార్పులే చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అని పై కథతో అర్థమవుతోంది.
అబ్బే, ఇదంతా ట్రాష్ అనేవాళ్ళూ లేకపోలేదు. మూల కథ అయితే మారదు కదా.! ఏమో, క్లయిమాక్స్ మారుతుందేమో.!
ప్రస్తుతానికైతే ఈ ఫస్ట్ రివ్యూతో సరిపెట్టుకోవాల్సిందే. అసలు రివ్యూ.. జస్ట్ కొన్ని గంటల్లో.. కాదు కాదు, కొన్ని నిమిషాల్లేనే వచ్చేస్తుంది.!

అమెరికాలో ప్రీమియర్స్ పడగానే.. అదే సమయంలో దాదాపుగా తెలుగు రాష్ట్రాలు రెండిటిలోనూ, చాలా చోట్ల ప్రీమియర్స్ పడిపోతాయ్.
సో.. టాక్ బయటకు వచ్చేయడానికి కూడా ఎంతో సమయం పట్టదన్నమాట.
Also Read: స్విమ్మింగ్ పూల్ సోయగం.! ర‘కూల్’ అండ్ లవ్లీ.!
అన్నట్టు.. ఒమైర్ సంధు.. అనే తేడాగాడైతే, ఓ చెత్త రివ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడండోయ్.! ఇంకోపక్క, ‘బ్రో’ మీద విపరీతమైన నెగెటివిటీని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
కాగా, తమిళ వెర్షన్‌కీ తెలుగు వెర్షన్‌కీ చాలా ఛేంజెస్ వుంటాయి. తమిళంలో మెయిన్ రోల్ యాభయ్యేళ్ళ వ్యక్తిది అయితే, తెలుగులో మాత్రం.. పాతికేళ్ళ కుర్రాడు.!
అక్కడ టైమ్ దేవుడు ఒకింత సీరియస్‌గానే కనిపిస్తాడు. తెలుగులో ఫుల్ ఎంటర్టైన్మెంట్.!
ఫుల్ అండ్ డిటెయిల్డ్ రివ్యూ కోసం.. స్టే ట్యూన్డ్.!