Bro The Avatar Politics.. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఏం జరిగిందో చూశాం.! ‘భీమ్లానాయక్’ సినిమా సమయంలో ఏం చేశారో చూశాం.!
‘బ్రో’ సినిమాకి ఏం జరగబోతోందో చూడబోతున్నాం.! ఔను, పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) తాజా సినిమా ‘బ్రో’ మీద పొలిటికల్ గద్దలు స్పెషల్ ఫోకస్ పెట్టాయ్.!
ఈ నెలాఖరున ‘బ్రో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు.
సముద్రఖని దర్శకత్వంలో ‘బ్రో’ తెరకెక్కింది. ఆల్రెడీ ‘బ్రో’ నుంచి ప్రోమోస్ షురూ అయ్యాయ్.! త్వరలో ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు కూడా.
Bro The Avatar Politics.. వసూళ్ళ సంగతేంటి.?
సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే అనూహ్యమైన రీతిలో జరిగే అవకాశం వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, టిక్కెట్ల రేట్ల సంగతేంటి.?
రీమేక్ సినిమా కాబట్టి, అదనపు టిక్కెట్ల రేట్ల కోసం ఆలోచన చేసే పరిస్థితి వుండకపోవచ్చు. నిజానికి, తెలంగాణలో ‘బ్రో’ సినిమాకి వచ్చే నష్టమేమీ లేదు.

కానీ, ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ‘బ్రో’ (Bro The Avatar) పరిస్థితి వేరు. అక్కడ రాత్రికి రాత్రి అన్నీ మారిపోతాయ్.!
ప్రేక్షకుడు మళ్ళీ పేదోడైపోతాడేమో..
గతంలో ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) సినిమా కోసం టిక్కెట్ల ధరల్ని అనూహ్యంగా తగ్గించేసిన సంగతి తెలిసిందే.
థియేటర్ల వెలుపల, థియేటర్ల లోపల.. అధికారుల్ని వుంచి మరీ, తక్కువ ధరలకు టిక్కెట్లను అమ్మించారు.
ఆ కారణంగా ‘భీమ్లానాయక్’ సినిమాకి ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నష్టం బాగానే వాటిల్లింది. ఆ నష్టాన్ని తాను భరించినట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
మరి, ‘బ్రో’ (Bro The Avatar) విషయంలో ఏం జరగబోతోంది.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.! ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే మాత్రం.. ఆంధ్రప్రదేశ్‌లో.. ప్చ్.. కష్టమే ‘బ్రో’.!