Urvashi Rautela Temple.. చాలాకాలం క్రితం తమిళ నటి కుష్బూకి గుడి కట్టేశారు.! అప్పట్లో అదో సంచలనం. ఆ తర్వాత మరో నటి నమితకి కూడా గుడి కట్టారు తమిళ తంబిలు.
తమిళనాట, ఇలా గుడి కట్టే ట్రెండ్.. సినీ అభిమానుల్లో కనిపిస్తుంటుంది. లిస్టులో ఇంకొందరు సినీ ప్రముఖుల పేర్లు కూడా వున్నాయ్.
ఐటమ్ బాంబ్ ఊర్వశి రౌతెలాకి కూడా ‘గుడి’ మీద ఆశ కలిగినట్లుంది. తనకు సౌత్‌లో ఎవరైనా గుడి కడితే బావుణ్ణంటూ ఓ స్టేట్మెంట్ పాస్ చేసేసింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో.
Urvashi Rautela Temple.. ఆల్రెడీ ఓ గుడి వుందట..
అన్నట్టు, ఊర్వశి రౌతెలాకి, ఓ గుడి వుందట. అదీ, బద్రినాథ్‌కి వెళ్ళే మార్గంలోనట. ఏంటి, నిజమేనా.? అంటే, నిజమైతే.. ఈపాటికే, సంబంధిత వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చేవి కదా.!

ఏ ఉద్దేశ్యంతో ఊర్వశి రౌతెలా, తనకు అభిమానులు గుడి కట్టాలని కోరుకుంటోందోగానీ, గుడి కట్టడానికైతే పెద్దగా ఖర్చేమీ వుండదు.. ఆమె రెమ్యునరేషన్‌తో పోల్చితే.
ఎక్కడో చిన్న స్థలం కొనుగోలు చేసేసి, అభిమానులకి కొన్ని డబ్బులు ఇచ్చేస్తే.. వాళ్ళే, గుడి వ్యవహారాలు చూసుకుంటారు కదా.!
డబ్బులు విదిలిస్తే.. గుడి కట్టెయ్యడమెంతసేపు.?
నమిత విషయంలో ఇలానే జరిగిందని అంటుంటారు. ఇదో ‘గుడి’సేటి అభిమానమన్న చర్చ అప్పట్లో జోరుగా సాగిందనుకోండి.. అది వేరే విషయం.
తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ లాంటి హేమాహేమీలతో సినిమాలు చేశాను కాబట్టి, తనకు గుడి కట్టాలంటూ చిత్రమైన ‘కోరిక’ని బయటపెట్టిన ఊర్వశి రౌతెలాని చూసి, నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు.

చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఊర్వశి.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహరాజ్’ సినిమాలో ఓ మోస్తరు నిడివి వున్న పాత్రలో ఊర్వశి నటించింది, వ్యాంప్ తరహా రోల్ ఆమెకు దక్కింది. స్పెషల్ సాంగ్ మామూలే.
అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమాలోనూ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. సంపత్ నంది ‘బ్లాక్ రోజ్’ అంటూ ఊర్వశి రౌతెలాతో ఓ సాంగ్ వదిలారుగానీ, సినిమా ఏమయ్యిందో ఎవరికీ తెలియదు.
Also Read: Touch Me Not Review: సమీక్ష.. బిగుసుకుపోయి, ఓవరాక్షన్ చేసేసి.!
పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా కోసం కూడా స్పెషల్ సాంగ్ చేసింది ఊర్వశి రౌతెలా.