Bro The Avatar Theme.. తమన్ అంటే.. ఆ కిక్కే వేరప్పా.! పాటల సంగతెలా వున్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో తమన్ ఇచ్చే ‘కిక్కు’ వేరే లెవల్‌లో వుంటుంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan, సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్‌లో సముద్రఖని తెరకెక్కించిన ‘బ్రో’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, తమన్ (Thaman Bro) ఈ సినిమాకి సంబంధించిన థీమ్ మ్యూజిక్‌ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.!
Bro The Avatar Theme.. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.!
ఔను.. నిజంగానే మాటల్లేవ్.! మాటలు లేక కాదు, మాటలు చాలడం లేదంతే.! తమన్ అంటే చాలామందికి ఓ ఎడిక్షన్.! అవును, తమన్ ఓ వ్యసనం.!

కాపీ ట్యూన్స్.. అన్న విమర్శలు వస్తున్నా, తమన్ అంటే ఆ క్రేజ్ ఎందుకు తగ్గడం లేదంటే.. ఇదిగో, ఇదీ కారణం.!
‘బ్రో’ (Bro The Avatar) థీమ్ మ్యూజిక్.. ఇది వేరే లెవల్ అంతే.! ఆల్రెడీ ఫస్ట్ ప్రోమోలోనే ఈ థీమ్‌కి సంబంధించిన కొత్త పార్ట్ వినేశాం.!
కానీ, ఫుల్ థీమ్.. ఆ లెక్కే వేరప్పా.! మాటల్లో వర్ణించడానికి కుదరడంలేదు.! ఆ స్థాయిలో వుందీ థీమ్ (Bro The Avatar).
థియేటర్లలో.. అది వేరే కిక్కు.!
డాల్బీ అట్మాస్.. ఆ తరహా సౌండ్ సిస్టమ్ నడుమ.. థియేటర్లలో ఈ థీమ్ మ్యూజిక్ వింటోంటే.. ఆ మజా వేరే వుంటుందన్నది నిర్వివాదాంశం.
Also Read: డాన్స్ అంటే.! చిరంజీవిలానే వుండాలి.!
‘బ్రో’ (Bro The Avatar) సినిమాకి సంబంధించి తమన్ అందించిన మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.
ప్రతిసారీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో బెస్ట్ ఔట్‌పుట్ ఇస్తోన్న తమన్.. ఈసారి అంతకు మించి.. అంటున్నాడు.!
జస్ట్.. ఇది ఓ శాంపిల్ మాత్రమే అనుకోవాలేమో ‘బ్రో’కి సంబంధించి.!