Table of Contents
Btech CSE Mudra369 Education.. అది సాధారణ ఇంజనీరింగ్ కళాశాల కావొచ్చు.. ఎన్ఐటీ, ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు కావొచ్చు.! ‘కంప్యూటర్’ మేనియా మామూలుగా లేదు.!
ఓన్లీ కంప్యూటర్ సైన్స్.. అది తప్ప ఇంకేదీ వద్దని విద్యార్థులు అనుకుంటున్నారా.? విద్యార్థుల్ని తల్లిదండ్రులు అలా తయారు చేస్తున్నారా.?
ఇవేవీ కాదు, పదో తరగతిలోనే.. అంతకన్నా ముందే, ‘కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్’ అనే టాపిక్‌ని పిల్లల మైండ్‌లో బలంగా రుద్దేస్తున్న విద్యా సంస్థల పైత్యమా.?
ఎందుకు.? కంప్యూటర్ సైన్సెస్ మాత్రమే ఎందుకు.?
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ ఏ మూల విన్నా కంప్యూటర్ సంగతులే.! చేతిలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేశాక.. ఇంకా కంప్యూటర్ల గోలేంటి.?
నిజానికి, కంప్యూటర్ అంటే.. ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ మాత్రమే కాదు.! అంతకు మించి. సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి కొలువులు సాధించాలంటే, ‘కంప్యూటర్ సైన్సెస్’ తప్పనిసరి.
ఆ కంప్యూటర్ సైన్సెస్‌లో ఇంజనీరింగ్ చేసినవాళ్ళకి మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. అదీ అసలు సంగతి.!
Btech CSE Mudra369 Education.. ప్యాకేజీల చదువు.!
కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్ చేసి ఏం సాధిస్తావ్.? అంటే, మంచి ఉద్యోగం.. అన్న సమాధానమే వస్తోంది చాలామంది నుంచి.

అదే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ గురించి ప్రశ్నిస్తే, ఆయా రంగాల్లో ఆవిష్కరణల గురించి కొందరైనా మాట్లాడతారు.
కానీ, కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్‌లో చేరితే.. ఆ వెంటనే ప్యాకేజీలు షురూ అవుతున్నాయి. మూడో ఏడాది పూర్తయితే.. లక్షల్లో వేతనాలతో ఆఫర్లు వచ్చి పడుతున్నాయ్ ప్రముఖ కంపెనీల నుంచి.
సంపాదన మీద యావ..
ఇలా ఇంజనీరింగ్ పూర్తి చేయగానే.. అలా మంచి వేతనంతో కూడిన ఉద్యోగం.! అద్గదీ.. అందుకే, కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్ అంటే అంత టెంప్టేషన్.!
Also Read: ఎకరం వెయ్యి కోట్లు! నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ!
అంతా బాగానే వుందిగానీ.. అందరికీ ఉద్యోగాలొచ్చేస్తున్నాయా.? ప్చ్.. ఎందుకు చదివామా ఈ కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్.. అని బాధపడేవాళ్ళూ లేకపోలేదు.
మారిన ట్రెండ్‌కి సంబంధించి విద్యార్థులేమనుకుంటున్నారు.? విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనలేంటి.? ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎలాంటి పరిస్థితులున్నాయ్.?
మరిన్ని విషయాల్ని.. ఇక్కడే, ఇంకో కథనంలో తెలుసుకుందాం. విద్యాభ్యాసమంటే, విద్యను అభ్యసించడం.! అంతేగానీ, చదువుని కొనుక్కోవడం కాదు.!
చివరగా.. కొనుక్కున్న చదువుకి తగిన సంపాదన కోసం అడ్డదార్లు తొక్కితే.. అది అజ్ఞానమనిపించుకుంటుంది.!