Butterfly Review.. అనుపమ పరమేశ్వరన్ మంచి నటి. ఆ విషయం చాలా సినిమాలతో ప్రూవ్ చేసుకుందామె. సీనియర్ నటి భూమిక కూడా ఆమెకు తోడయ్యింది.! పైగా థ్రిల్లర్ కాన్సెప్ట్.!
అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని.. అన్నట్టు తయారైంది ‘బటర్ ఫ్లై’ సినిమా పరిస్థితి. నేరుగా ఓటీటీలోకి వచ్చింది ఈ సినిమా.
తల్లిదండ్రుల్ని కోల్పోయిన అక్కా చెల్లెళ్ళలో.. అక్క కష్టపడి చదివి, తన చెల్లెల్నీ చదివిస్తుంది. అక్క న్యాయవాది. న్యామూర్తిగా అవకాశం దక్కించుకునే సమయంలో అనుకోని ఘటన జరుగుతుంది.
Butterfly Review అక్కా చెల్లెళ్ళ వ్యధ..
అక్క ఊళ్ళలో లేని సమయంలో ఆమె పిల్లలు కనిపించకుండా పోవడంతో, చెల్లెలు పడే బాధ.. ఈ కథ. మరదలిపై బావ కన్నేయడంతో, భర్తను కాదనుకుంటుంది ఈ కథలోని అక్క.
ఇక్కడ చెల్లెలికి ఓ లవర్ వుంటాడు. ఆమెకు కష్ట కాలంలో అండగా వుంటాడుగానీ.. ప్చ్.. అతని పాత్రనీ సరిగ్గా డిజైన్ చేయలేదు.
కిడ్నాప్ గ్యాంగ్ ఏదో చేసిందిగానీ.. బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువన్నట్టు తయారైంది పరిస్థితి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల ఆకట్టుకుంది.
భారం మోయలేకపోయిన అనుపమ..
సినిమా మొత్తాన్నీ అనుపమ తన భుజాల మీద మోసే ప్రయత్నమైతే చేసిందిగానీ.. కథ భారంగా నడుస్తుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థతి అనుపమది.
సాధారణంగా ఇలాంటి సినిమాల్లో వేగం ముఖ్యం. ఆ వేగం బొత్తిగా లోపించడంతో ‘బటర్ ఫ్లై’ సరిగ్గా ఎగరలేకపోయిందన్నమాట.
Also Read: మాళవిక సెటైర్.! నయనతార కౌంటర్ ఎటాక్.!
వేగమే శతృవు ఈ సినిమా వరకూ.! అనుపమ అయితే తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. డైలాగులు మరీ అంతగా ఏం ఆకట్టుకోవు. సోసోగా అనిపిస్తాయంతే.
ఓటీటీ బొమ్మ అయినాగానీ, సమయం అందరికీ ఉచితం కాదు.. టైమ్ వేస్ట్ అనుకునే అవకాశం వుంది.
కానిస్టేబుల్ సాయంతో పని చక్కబెట్టేయడం.. ఓ అపార్టుమెంటుకే చాలావరకు కథని పరిమితం చేసెయ్యడం.. ట్విస్టులు సరిగ్గా లేకపోవడం.. ఒకటేమిటి.? బోల్డన్ని మైనస్సులుండగా.. ప్లస్ పాయింట్ అంటే, అనుపమ మాత్రమే.