Cancer Prevention.. క్యాన్సర్.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ఇది. కోవిడ్ వైరస్ గురించో, ఇంకో మహమ్మారి గురించో మాట్లాడుకుంటాం.. చర్చించుకుంటాంగానీ, క్యాన్సర్ గురించి ఎందుకు చర్చించుకోం.?
ఏడాదికోసారి.. క్యాన్సర్ దినోత్సవం అనగానే ప్రభుత్వాలు అవగాహనా కార్యక్రమాలంటాయ్.! సెలబ్రిటీలెవరైనా క్యాన్సర్ బారిన పడితే.. అప్పుడు బోల్డంత రచ్చ జరుగుతుంటుంది.
క్యాన్సర్‌ని నివారించగలమా.? ఎందుకు నివారించలేం.! నివారించగలం.. కానీ, నివారించడానికి తగిన చర్యలు తీసుకోం. అదే అసలు సమస్య.
ధూమపానమే తొలి శతృవు..
క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్నవారిలో ఎక్కువమందికి ధూమపానంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లింక్ వుంటోంది. ఎన్నో పరిశోధనల్లో తేలిన వాస్తవమిది.
క్యాన్సర్ అంటే కేవలం ఓ రోగం మాత్రమే కాదు.! సమాజానికి పట్టిన జాడ్యం అని కూడా అనొచ్చు.! క్యాన్సర్ సోకిన వ్యక్తి చనిపోవడానికి అవకాశాలెక్కువ.
అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వస్తున్న దరిమిలా.. జీవించే కాలం పెరుగుతోంది. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ పూర్తిగా నయమవుతోంది కూడా.
కానీ, అత్యంత ఖరీదైన చికిత్స కారణంగా.. క్యాన్సర్ సోకిన వ్యక్తి బతికినా.. కొన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయ్.!
అందుకే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్.. అనేది. చికిత్స కంటే నివారణే ముఖ్యం.
కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
Mudra369
పొగాకు నమలడం.. లేదా, ఇంకే రూపంలో అయినా దాన్ని వాడటం.. ఇదీ క్యాన్సర్ కేసుల్లో ఎక్కువగా వైద్యులు గుర్తిస్తోన్న కారణం.
మన ప్రభుత్వాలేం చేస్తాయ్.? పొగాకు ఉత్పత్తుల మీద పన్నులు పెంచుతాయ్. కానీ, స్మోకింగ్ చేసేవారి సంఖ్య తగ్గుతోందా.? లేదే.!

అసలంటూ పొగాకుపై నిషేధం విదిస్తేనో.? క్యాన్సర్ నివారణలో తొలి మెట్టు అవుతుందది. అదొక విప్లవాత్మకమైన మార్పు అవుతుంది కూడా.!
పొగాకు ఉత్పత్తుల మీద విధించే పన్నులతో వచ్చే ఆదాయం విషయంలో ప్రభుత్వాలు కక్కుర్తి పడకుండా వుంటే.. వైద్యం మీద ప్రభుత్వాలు చేయాల్సిన ఖర్చు భారమూ తగ్గుతుంది.
Cancer Prevention మద్యపానం కూడా..
మద్యపానం కూడా ఈ మధ్య క్యాన్సర్‌కి కారణమవుతోందంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ, దేశంలో మద్య నిషేధానికి ఆస్కారం వుండదు. ఎందుకంటే, ప్రభుత్వాలకి మద్యం ఇచ్చే కిక్కు అలాంటిది.!
మంచి ఆహారపుటలవాట్లు.. మన చేతిలో వున్నదే కదా.?
దుర్వ్యసనాలకు దూరంగా వుండటం.. మనకు సాధ్యమయ్యేదే కదా.?
క్యాన్సర్ సోకిన వ్యక్తులకు చికిత్స చేయడం సంగతెలా వున్నా.. ముందైతే, క్యాన్సర్ నివారణ దిశగా సమాజానికి చికిత్స అవసరం.! ప్రజలకే కాదు, ప్రభుత్వాలకి కూడా.!
Mudra369
ఇంతకీ, జనం ఏం చేస్తున్నారు.? ఇదీ అసలు విషయం. ఛస్తామని తెలిసీ.. ధూమపానాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నట్టు.? ప్లాస్టిక్ వాడకాన్ని ఎందుకు తగ్గించలేకపోతున్నట్టు.? మద్యపానం వైపు ఎందుకు వెళుతున్నట్టు.?
అన్నీ ప్రభుత్వాలే చేయాలంటే కుదరదు. ఇవీ క్యాన్సర్ కారకాలని తెలిసినప్పుడు.. ఆయావస్తువులు లేదా ఆహార పదార్థాలు.. అలవాట్లు.. వీటికి మనమే కాస్త దూరంగా జరగాలి.
Also Read: Money For Sale.. ఇచ్చట డబ్బులు అమ్మబడును.!
కాలుష్యం వంటివీ క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయ్. పురుగుల మందులు, కొన్ని రకాల కాస్మొటిక్స్.. ఇవన్నీ క్యాన్సర్ కారకాలని తెలిసినప్పుడు.. కాస్తంత జాగ్రత్తగా వుండాల్సిన బాధ్యత మనదే కదా.?