CBN Jagan Dirty Politics.. రాజకీయాలన్నాక విమర్శలు సహజమే కావొచ్చు.! కానీ, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఎంతవరకు సబబు.?
ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి.. ఈ పార్టీలోంచి ఇంకో పార్టీలోకి దూకెయ్యడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య.
తిట్టిన నోటితోనే పొగడాల్సి వస్తుంది గనుక, తిట్టేటప్పుడు కాస్తంత జాగ్రత్త పడాలి కదా.? ఇంకా నయ్యం.. అదే వుంటే, ఈ ఛండాలం రాజకీయాల్లో ఎందుకు వుంటుంది.?
CBN Jagan Dirty Politics.. సుదీర్ఘ రాజకీయ అనుభవం.. చెత్త బుట్టలో.!
తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పదే పదే చెబుతుంటారు. అది నిజం కూడా.!
కానీ, ఆ అనుభవం ఆయనకు సంస్కారం నేర్పలేదెందుకు.? సంస్కారం వుండి వుంటే, రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘తప్పుడు పుట్టక’ అని ఎలా అనగలుగుతారు.?
తన భార్య విషయంలో ఎవరో ఏదో అన్నారని, మీడియా ముందరకొచ్చి చంద్రబాబు కంటతడి పెట్టారు. మరి, చంద్రబాబు వ్యాఖ్యలకు వైఎస్ విజయమ్మ ఎలా స్పందించాలి.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకెలా స్పందించాలి.?
తప్పు ఎవరు చేసినా తప్పే.!
నారా భువనేశ్వరి విషయంలో వైసీపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు గతంలో. అదీ సమర్థనీయం కాదు.
నారా లోకేష్ పుట్టుక గురించి వైసీపీ నేతలు ఏదో అంటున్నారు గనుక, వైఎస్ జగన్ పుట్టుక మీద చంద్రబాబు ఇంకేదో అనేశారనడమూ సమంజసం కాదు.

రాజకీయం అంటే ప్రజా సేవ.! ఔను, ప్రజా సేవ మాత్రమే.! అంతే తప్ప, అడ్డగోలు ఆరోపణలు చేసుకోవడానికి రాజకీయం వేదిక కాకూడదు.
Also Read: కొత్త ఒక వింత.! ‘బ్రిక్ బిర్యానీ’ తెలుసా మీకు.?
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఏ రాజకీయ నాయకుడూ వ్యవహరించకూడదు.! దురదృష్టం, రాజకీయ నాయకుల మాటలకు జనం సిగ్గు పడుతున్నారు.. ఇలాంటోళ్ళనా చట్ట సభలకు మనం పంపుతున్నది.. అనుకుంటూ.!
ఏది ఏమైనా, పధ్నాలుగేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నోట ‘తప్పుడు పుట్టక’ అన్న విమర్శ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద రావడం అత్యంత అభ్యంతకరం.!