Chalamalasetty Sunil Kakinada YSRCP ముచ్చటగా మూడు పర్యాయాలు కాకినాడ లోక్ సభకు వివిధ పార్టీల నుంచి పోటీ చేసి పరాజయం చవిచూశారాయన.! ఆయనే చలమలశెట్టి సునీల్.
విద్యాధికుడు, మిస్టర్ క్లీన్ ఇమేజ్.. ఇవన్నీ సానుకూల అంశాలే అయినా.. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి అనేది అస్సలు మింగుపడని విషయం.
తొలిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచీ పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, మూడోసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు.
ఈసారి లెక్కలు పూర్తి అనుకూలం..
పోటీ చేసిన ప్రతిసారీ, చాలా తక్కువ ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఈసారి మాత్రం, ఈక్వేషన్స్ ఆయనకి అనుకూలంగా కనిపిస్తున్నాయి.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన చలమలశెట్టి సునీల్‌కి, మారు ఆలోచన చేయకుండా వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కాకినాడ లోక్ సభ్య అభ్యర్థఇగా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
వైసీపీ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు తోడు, చలమలశెట్టి సునీల్‌కి వున్న క్లీన్ ఇమేజ్, వ్యక్తిగతంగా ఆయనకు కాకినాడ నియోజకవర్గంలో వున్న స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఈసారి అడ్వాంటేజ్ అయ్యేలా వుంది.
గత ఎన్నికల్లో.. అంటే, వైసీపీ వేవ్ అనూహ్యంగా కనిపించినప్పుడూ చాలా తక్కువ ఓట్ల తేడాతోనే టీడీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Chalamalasetty Sunil Kakinada YSRCP.. గెలుపు గుర్రమే..
ఇప్పుడైతే, సామాజిక వర్గ సమీకరణాలు సహా, అన్నీ చలమలశెట్టి సునీల్‌కి అనుకూలంగా మారుతున్నాయి.
కాకినాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఈక్వేషన్స్ ఎలా వున్నా, ఎంపీ అభ్యర్థి సునీల్ చలమలశెట్టికి అనుకూల వాతావరణం ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్.
టీడీపీ – జనసేన కూటమి అభ్యర్థి బరిలోకి దిగుతున్నప్పటికీ, ఆ ప్రభావం చలమలశెట్టి సునీల్ గెలుపుమీద మీద ఏమాత్రం వుండకపోవచ్చు.
ఎన్నికలకు తక్కువ సమయం వున్న దరిమిలా, గ్రౌండ్ లెవల్‌లో ఇప్పటికే చలమలశెట్టి సునీల్ ‘వర్క్’ చేసుకుంటూ వెళుతున్నారు.
విద్యాధికుడు, పారిశ్రామిక వేత్త అయిన చలమలశెట్టి సునీల్, కాకినాడ ఎంపీగా ఎన్నికైతే, లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న చర్చ సాధారణ ప్రజానీకంలో జరుగుతోంది.
వైసీపీలో చేరడం, టిక్కెట్ దక్కించుకోవడం.. ఈ పాజిటివ్ మూడ్‌లో మరింత యాక్టివ్‌గా జనాల్లోకి వెళుతున్న చలమలశెట్టి సునీల్, ఎంత మెజార్టీ సాధిస్తారన్నదానిపై అప్పుడే డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి.