Table of Contents
Pawan Kalyan Jagan Eleven.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జస్ట్ పదకొండు సీట్లకు పడిపోతుందని ఎవరైనా ఊహించారా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా అంచనా వేశారు.
151 సీట్లలో, మధ్యలోని ‘ఐదు’ ఔట్ అయిపోయి, 11 సీట్లకు వైసీపీ పరిమితమైపోతుంది.. అని స్వయంగా పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికలకు ముందర వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ చెప్పినట్లే, జూన్ 4, 2024న వెల్లడయిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి.
Pawan Kalyan Jagan Eleven.. వై నాట్ 175 – అతి పెద్ద కామెడీ..
వైసీపీకి పరాజయం తప్పదని, టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఏర్పాటుతో వైసీపీ శ్రేణుల్లోనూ ఓ అవగాహన వచ్చింది. వైసీపీ అధినాయకత్వానికీ ఇదే విషయం ‘సర్వేల రూపంలో’ తెలిసింది.
కానీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో ‘వై నాట్ 175’ అన్నారు. నిజానికి, ‘వై నాట్ 175’ నినాదం పుట్టినప్పటికి ఇంకా ‘పొత్తులు’ ఖరారవలేదు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడితే 175 సీట్లు వస్తాయ్.. విడివిడిగా పోటీ చేస్తే, ఒకటో రెండో తగ్గుతాయేమో.. అని వైసీపీ నేతలు కొందరు వ్యాఖ్యానించడం చూశాం.
గెలుపోటములు సహజమేగానీ..
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ, ఈ విషయాన్ని అప్పటి అధికార వైసీపీ కూడా తెలుసుకోవాలి కదా.? విర్రవీగింది. వై నాట్ కుప్పం.. అంటూ వైఎస్ జగన్, ఎగతాళి చేశారు.
కట్ చేస్తే, వైసీపీ స్థాయి 11 సీట్లకు పడిపోయింది. ప్రతిపక్ష హోదాని అడుక్కోవాల్సిన స్థాయికి వైసీపీ దిగజారిపోయింది. అసెంబ్లీ మొహం చూడాలంటే, వైఎస్ జగన్ భయపడిపోతున్నారు.
అసలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వుండడానికే వైఎస్ జగన్ ఇష్టపడక, బెంగళూరుకి వెళ్ళిపోయారు.. భయంతో.! వీకెండ్ పొలిటీషియన్‌లా మారారాయన.
పవన్ కళ్యాణ్ వ్యూహం..
ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. వైసీపీ, పదకొండు సీట్లకు పడిపోవడం అనేది ‘పవన్ కళ్యాణ్ రాసిన రాత’. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
‘గుర్తు పెట్టుకో జగన్.. వైసీపీని అదఃపాతాళానికి తొక్కేస్తా..’ అని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘నెత్తి మీద కాలు వేసి, పాతాళానికి తొక్కుతాం కదా’ అని కూడా పవన్ కల్యాణ్ అన్నారు.
అన్నారు, మాట మీద నిలబడ్డారు.. వైసీపీని పాతాళానికి తొక్కేశారు. అదే సమయంలో, ‘పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్’ అనే వైసీపీ వెటకారానికి చావు దెబ్బ కొట్టారు, స్ట్రైక్ రేట్‌తో.
Also Read: స్వర్గీయ ఎన్టీయార్: ప్రతిసారీ అదే పాత కథ.!
పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లలో ‘100 శాతం స్ట్రైక్ రేట్’తో జనసేన పార్టీ బంపర్ విక్టరీ అందుకున్న సంగతి తెలిసిందే. జనసేన ఘన విజయానికి జూన్ 2వ తేదీతో ఏడాది.
వైసీపీ పతనానికి కూడా అదే జూన్ 4వ తేదీతో ఏడాది పూర్తవుతుంది. తెలుగు నాట రాజకీయాల్లో ఇదొక సంచలనం. ఇదొక చారిత్రాత్మక ఘట్టం.