Chandrababu Arrest Siddharth Luthra.. తెలుగు రాష్ట్రాల్లో.. అందునా, సిద్దార్ధ లూద్రా పేరు మార్మోగిపోతోంది.! తెలంగాణలోనూ టీడీపీ శ్రేణుల హంగామా వల్లనే ఈ పేరుకి మైలేజ్ వస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అయితే, ఎవరీ సిద్దార్ధ లూద్రా.? అంటూ సాధారణ ప్రజానీకమూ చర్చించుకుంటున్నారు.
సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్ధ లూద్రా.! హై ప్రొఫైల్ కేసుల్నే ఎక్కువగా డీల్ చేస్తుంటారీయన. ఫీజు లక్షల్లోనూ.. కోట్లలోనూ వుంటుందిట.
కేసుని బట్టి ఆయన ఫీజు ఆధారపడి వుంటుంది. చూడ్డానికి మాత్రం చాలా సింపుల్‌గా కనిపిస్తారు. గర్వం అస్సలు ఆయన మొహంలో కనిపించదంటారు.! ఏమో, అదెంత నిజమో.!
Chandrababu Arrest Siddharth Luthra.. బయటకు తీసుకురాలేక..
సిద్దార్ధ లూద్రా ఇమేజ్‌కి చంద్రబాబు (Nara Chandrababu Naidu) అరెస్టు వ్యవహారం ఓ సవాల్‌గా మిగిలింది. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా సిద్దార్ధ లూద్రాని చెబుతారు.
ఏకంగా యాభై కోట్ల రూపాయల ఫీజుని సిద్దార్ధ లూద్రా (Siddharth Luthra) చెల్లిస్తున్నారన్నది జరుగుతున్న ప్రచారం. కానీ, నిజమేనా.? అదంతే.!
ఇంతా ఖర్చు చేసి కూడా, చంద్రబాబు జైలు నుంచి బయటకు రాలేకపోతున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్ళకుండా కాపాడలేకపోయిన సిద్దార్ధ లూద్రా ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నట్టేనా.?
కత్తి పట్టాల్సిందేనట..
‘అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపు మేర లేకుంటే ఇక కత్తి పట్టడమే. పోరాటానికి ఇదే సరైన విధానం..’ అంటూ ట్వీటేశారు సిద్దార్ధ లూద్రా తాజాగా.
గురు గోవింద్ సింగ్ చెప్పిన మాట ఇది. అయితే, దీనిపై లూద్రా వివరణ ఇచ్చారు. ‘చట్టమే న్యాయవాదుల కత్తి’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read: జూ.ఎన్టీయార్‌కి ‘చంద్ర’గ్రహణం.! బాలయ్య కనుసన్నల్లో.?
‘మోటో ఆఫ్ ది డే’ అంటూ, న్యాయవాది సిద్దార్ధ లూద్రా చేసిన ట్వీట్, ఇప్పుడు వైరల్ అవడమే కాదు.. ఆయనకి బోల్డంత ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది.
అదే సమయంలో, సిద్దార్ధ లూద్రా మీద విపరీతమైన ట్రోలింగ్ కూడా జరుగుతోంది.! ఇంతకీ లూద్రా పట్టబోయే కత్తి, చంద్రబాబుని జైలు నుంచి ఎప్పుడు బయటకు తీసుకొస్తుంది.?