Chandrababu IT Notice.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు అవబోతున్నారట.! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతున్నారు.
ఐటీ శాఖ చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన వ్యవహారం ఇటీవల వెలుగులోకి రావడంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే.
రాజధాని అమరావతి ప్రాజెక్టుకి సంబంధించిన స్కామ్‌లో చంద్రబాబుకి 118 కోట్ల రూపాయల మేర లంచం ముట్టిందన్నది ప్రధాన ఆరోపణ.
అయితే, ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులకు చంద్రబాబు సమాధానమిచ్చుకుంటారు.. ఇచ్చుకోవాలి కూడా. ఇరు పక్షాల మధ్యా లేఖలు ఎక్స్‌ఛేంజ్ అవుతున్నాయ్.
Chandrababu IT Notice.. సమస్యకి పరిష్కారమూ వుంది..
ఈ తరహా వ్యవహారాల్లో ‘తగిన పన్ను కట్టడం’ ద్వారా సమస్య పరిష్కారమైపోతుంది. చాలావరకు ‘వివరణతోనే’ ఈ తరహా వివాదాలు ముగిసిపోతుంటాయనుకోండి.. అది వేరే సంగతి.
అధికార వైసీపీ చేస్తున్న యాగీని తెలుగుదేశం పార్టీ మేగ్జిమమ్ ఎంజాయ్ చేస్తోందన్నది నిర్వివాదాంశం. తద్వారా టీడీపీకి పొలిటికల్ మైలేజ్ పెరుగుతోంది.
తెగేదాకా లాగి, చివరికి వైసీపీని వెర్రి వెంగళప్పని చేయడం టీడీపీ ఉద్దేశ్యమట.! అంతేనా.? చంద్రబాబు తనదైన చాణక్యంతో వ్యవహరిస్తున్నట్టేనా.?
Also Read: ఇండియా! భారత్! రెండు పేర్ల మధ్య చిచ్చు పెడుతున్నదెవరు?
ఏమోగానీ, ఇది టీడీపీ ఇమేజ్‌కి డ్యామేజీ అన్న ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. అందులో నిజమెంత.? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.
ఒక్కటి మాత్రం నిజం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చీమ చిటుక్కుమన్నా.. అదో పెద్ద రాద్ధాంతమవుతూ వస్తోంది. నాలుగున్నరేళ్ళుగా.. చంద్రబాబు అరెస్టు కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. ప్చ్.. పని జరగలేదాయె.!
చంద్రబాబుని ఐటీ వివరణ మాత్రమే అడిగింది. గతంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు కూడా వెళ్ళివచ్చిన విషయాన్ని కన్వీనియెంట్‌గా వైసీపీ మర్చిపోతే ఎలా.?
చిత్ర విచిత్రమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్నాయి. వీటిల్లో దేన్ని నమ్మాలో తెలియని అయోమయం రాష్ట్ర ప్రజలకు కలుగుతోంది. ఈ గందరగోళ రాజకీయాలు ముందు ముందు మరింతగా ముదిరి పాకాన పడనున్నాయి.