Table of Contents
Chandrababu Jail Half Century.. ఒకప్పుడు రాజకీయ నాయకులు, ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్ళేవాళ్ళు.! ఇప్పుడు పరిస్థితులు వేరు.!
నేరాలు, ఘోరాలు చేసి జైళ్ళకు వెళుతున్నారు కొందరు నేతలు. అంతకన్నా పెద్ద ఘోరాలు, నేరాలకు పాల్పడినవాళ్ళు.. వ్యవస్థల్లోని లోటుపాట్లను అడ్డంపెట్టుకుని తప్పించుకు తిరుగుతున్నారు.
ఇంకొందరి పరిస్థితి భిన్నం.! అక్రమ కేసుల కారణంగా జైళ్ళలో మగ్గిపోతున్నారు.! ప్రజా పోరాటాలు.. ఈ క్రమంలో జైళ్ళకు వెళ్ళడం.. ఇదంతా ఇప్పుడూ వుంది.
కాకపోతే, ఈ ప్రజా ఉద్యమాలు కూడా, స్పాన్సర్డ్ ఉద్యమాలే అవుతున్నాయి. అదే అసలు సమస్య. అన్నీ అని కాదుగానీ, చాలా ఉద్యమాల పరిస్థితి ఇదే.!
Chandrababu Jail Half Century.. జైలు పక్షి చంద్రబాబు..
వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట.. అన్న గుర్తింపు చంద్రబాబుకి వుంది. అలాంటి చంద్రబాబు, యాభై రోజులుగా జైలు గోడలకే పరిమితమైపోవడం ఆశ్చర్యకరం.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొందరు నిందితులకు బెయిల్ వచ్చింది. కానీ, చంద్రబాబు మాత్రం జైలు నుంచి బయటకు రాలేకపోతున్నారు.
వినాయక చవితి కూడా జైల్లోనే.! దసరా పండుగ కూడా జైల్లోనే.! సంక్రాంతి పండక్కి కూడా చంద్రబాబు జైల్లోనే వుంటారన్నది వైసీపీ చెబుతున్నమాట.
తనకు ప్రాణ హాని వుందంటూ కోర్టుకి చంద్రబాబు విన్నవించుకోవాల్సి వస్తోంది. కానీ, ఆయనకు ఊరట దక్కుతుందా.? ఇదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
ఆ ముద్ర చెరిగిపోయింది..
వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేయగలరన్న అపవాదు నుంచి విముక్తి కలిగింది ఈ అరెస్టు కారణంగా. వాయిదాలు, నాట్ బిఫోర్ మీ.. వ్యవహారాలు.. ఇవన్నీ న్యాయపరమైన అంశాలు. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడలేం.!
ఒక్కటి మాత్రం నిజం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మిస్ అవుతున్నారు. లేదంటే, ఆయనే స్టార్ క్యాంపెయినర్ అయి వుండేవారు.
సరే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేసినా, ఆ పార్టీ గెలిచే సీట్లు ఎన్ని.? అన్నది వేరే చర్చ.
కక్ష సాధింపు రాజకీయమే..
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. నడుస్తున్నవి కక్ష సాధింపు రాజకీయాలే. భవిష్యత్తు మరింత భయానకంగా వుండబోతోంది.!
అధికారంలో వున్నోళ్ళు, అధికారంలో లేనోళ్ళని పీడించుకు తినడానికే రాజకీయం.. అన్నట్టు మారబోతోంది పరిస్థితి.
ఇంతకీ, అర్థ శతదినోత్సవం తర్వాత ఆగుతుందా.? శతదినోత్సవం వైపుగా ‘జైలు పక్షి చంద్రబాబు’ అనే ఎపిసోడ్ సాగుతుందా.? వేచి చూడాల్సిందే.