Chandrababu Legal Plans.. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట.. అని చాలామంది చెబుతుంటారు. రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు మీద చేసే మొదటి విమర్శ ఇదే.!
కానీ, అరెస్టు నుంచి చంద్రబాబు తప్పించుకోలేకపోయారు. పోనీ, అరెస్టయ్యాక బెయిల్ తెచ్చుకుని విడుదలయ్యారా.? అంటే, ఇప్పటికీ అది జరగలేదు.
ఇదిగో బెయిల్ పిటిషన్.. అదిగో విడుదల.. అంటూ, టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం తప్ప, చంద్రబాబు (Telugu Desam Party Chief Nara Chandrababu Naidu) బయటకు రాకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
Chandrababu Legal Plans.. బెయిల్ పిటిషన్లు ఎక్కడ.?
ముందస్తు బెయిల్ కోసం అప్లయ్ చేయాల్సిన చంద్రబాబు (Nara Chandrababu Naidu) లైట్ తీసుకున్నారు. అరెస్టయ్యాక కూడా ఇంతవరకు బెయిల్ పిటిషన్ వేయలేదట.!
ఆల్రెడీ వేశారంటారు.. కాదు, కాదు రేపు వేస్తారంటారు.! ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. తెలుగు తమ్ముళ్ళకు ఈ విషయమై ఎలా స్పందించాలో తెలియడంలేదాయె.

వాట్ నెక్స్‌ట్.? ఏమో, ఏదైనా జరగొచ్చు. బెయిల్ రావొచ్చు.. లేదంటే, ఎఫ్ఐఆర్ కొట్టేయొచ్చు.! లీగాలిటీస్ ఏంటన్నది అంచనా వేయడం కష్టం.
క్వాష్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ తర్వాత, ఓ క్లారిటీ రావొచ్చు.! అదే సమయంలో బెయిల్ పిటిషన్లు కూడా మూవ్ చేస్తారేమో.!
ఇంత అలసత్వం.. వ్యూహాత్మకమా.?
అరెస్టయ్యాం.. జైలుకు వెళ్ళాం.. బెయిల్ వరకూ రాకుండా, ఎఫ్ఐఆర్ క్వాష్ అయిపోతే, మిస్టర్ క్లీన్‌గా బయటకు రావొచ్చు.!
ఇదే చంద్రబాబు వ్యూహమా.? ఆయన వ్యూహం సరిపోదు.! అట్నుంచి ప్రభుత్వం, సీరియస్‌గానే చంద్రబాబు విషయంలో వ్యవహరిస్తోంది.
More At: సినిమానా? రాజకీయమా? ఏదో ఒక్కటే.! తేల్చేసుకోవాల్సిందే.!
కానీ, సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూద్రా టీమ్‌ని తక్కువ అంచనా వేయలేం. చంద్రబాబు వ్యూహం ఫలిస్తే, వచ్చే ఎన్నికల్లో ఆయనకు విపరీతమైన సింపతీ కలిసొస్తుంది.
తేడా వస్తే.. అంతే సంగతులు.! వ్యవహారం నిజంగానే చాలా తేడా అయిపోతుంది.
మొత్తమ్మీద, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ (Skill Development Scam).. జరిగిందో లేదో తెలియదుగానీ, చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయంలో అనూహ్యమైన పరిణామాల్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. అదీ, జీవిత చరమాంకంలో.!