అక్కినేని నాగచైతన్య, సమంత (ChaySam Divorce Kangana Vs AAmir) తమ నాలుగేళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పేశారు. ఇద్దరూ వారి వారి దారులు వేరు వేరుగా చూసుకోవాలని డిసైడ్ అయిపోయారు. అసలు వీళ్లెందుకు విడిపోయారు.? ఎవరు వీళ్లను విడదీశారు.? మీడియా పోస్ట్‌మార్టం మొదలెట్టేసింది. సరే, మీడియాకి ఏదో ఒక టాపిక్ ఉంటే తప్ప 24 గంటల న్యూస్ కవరేజ్ కష్టం కనుక, వాళ్ల పాట్లు వాళ్లు పడుతున్నారు.
కానీ, కందకు లేని దురద కత్తిపీటకెందుకు.? బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వల్లనే నాగచైతన్య, సమంతను వదిలించుకున్నాడంటూ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) సంచలన వ్యాఖ్యలు చేసింది. కామెడీ ఏంటంటే, కంగనా రనౌత్ కూడా కొన్ని ప్రేమ కథలు నడిపింది. పెళ్లి మీద పెద్దగా నమ్మకం లేని కంగనా, అప్పట్లో సహజీవనాలు చేసింది.
అలా ఎంతో మందిని ముంచేసిందీ, ఆమె మునిగిపోయింది కూడా. కంగనా గతం గురించి తెలిసినోళ్లంతా పెళ్లి గురించి, విడాకుల గురించి ఇంత కామెడీ చేసిందేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. అన్నట్లు అమీర్ ఖాన్ (Aamir Khan) పెళ్లిళ్లు, విడాకుల విషయంలో ఘటికుడే. కానీ, విడాకులు తీసుకోండని అతను ఎవరికీ సలహాలు ఇచ్చి ఉండకపోవచ్చు.
ఇంతకీ, ఈ గందరగోళంలోకి హీరో సిద్దార్ధ్ ఎందుకు దూరినట్లు.? మోసం చేసినోళ్లెవరకూ బాగు పడరు.? అంటూ మాంచి టైమింగ్‌తో ట్వీటేసి సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాడు. సిద్దార్ధ ఉద్దేశ్యం ఏంటో ఎవరికీ తెలియదు. కానీ, అతని ట్వీట్ సమంత మీద అక్కసుతోనే.. అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అన్నట్లు సిద్దార్ధ జీవితంలోనూ బోలెడన్ని ఎఫైర్లున్నాయి. సమంత, సిద్దూ అప్పట్లో సన్నిహితంగా మెలగడం తెలిసిన విషయమే.
సినిమా అంటేనే ఉన్నదీ, లేనిదీ అన్నీ కలబోసిన ఓ పెంట వ్యవహారం అంటారు చాలా మంది. కానీ, సమాజంలో ఏముంటుందో, సినీ పరిశ్రమలోనూ అదే ఉంటుంది. అదీ, ఇదీ వేర్వేరు కాదు. సెలబ్రిటీలు విడిపోతే, సంచలన వార్త అవుతుందంతే. అంతకు మించి దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు.
కంగనా కారు కూతలు కూసినా, సిద్దార్ధ సిల్లీ సెటైర్లేసినా, వారి వారి పైత్యాన్ని జనం మీద రుద్దడానికే. సమంత, నాగచైతన్య విడాకుల్ని (ChaySam Divorce Kangana Vs AAmir) భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బలమైన బంధం, బలహీనపడడంతోనే వీగిపోయిందని భావించాలి.