Chikiri Ramcharan Janhvi Peddi.. వచ్చేసింది.. ‘పెద్ది’ సినిమా నుంచి ‘చికిరి చికిరి’ ఆడియో సింగిల్. ఆల్రెడీ, హుక్ స్టెప్ ‘గ్లింప్స్’ ద్వారానే సెన్సేషన్ అయిపోయిన సంగతి తెలిసిందే.
తాజాగా, ‘చికిరి చికిరి’ ఆడియో సింగిల్‌ని విడుదల చేసింది ‘పెద్ది’ టీమ్. రామ్ చరణ్ నుంచి మరిన్ని డాన్స్ మూమెంట్స్, ‘చికిరి చికిరి’ ఆడియో సింగిల్‌లో చూడొచ్చు.
నిజానికి, ఇన్ని డాన్స్ మూమెంట్స్ ‘చికిరి చికిరి’ ఆడియో సింగిల్‌లో ‘పెద్ది’ టీమ్ పెడుతుందని, రామ్ చరణ్ అభిమానులు కూడా ఊహించి వుండరు.
Chikiri Ramcharan Janhvi Peddi.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ..
రామ్ చరణ్ – జానీ మాస్టర్.. ఈ ఇద్దరిదీ డెడ్లీ కాంబినేషన్.. డాన్సుల విషయంలో.! హై ఓల్టేజ్ ఎనర్జీ కనిపిస్తుంటుంది రామ్ చరణ్ కోసం కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ డాన్సుల్లో.
చరణ్ కోసం జానీ ఎంత ప్రత్యేకంగా డాన్సులు కంపోజ్ చేస్తాడో, అంతకు మించి.. రామ్ చరణ్, ఆ డాన్సులకి గ్లామర్ తీసుకొస్తాడు.
‘చికిరి చికిరి’ పాటలో, చరణ్ చేసిన డాన్సులు.. ఆ డాన్స్ స్టెప్స్‌ని కంపోజ్ చేసిన జానీ మాస్టర్.. ఇద్దరికీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఆడియో సింగిల్లోనే ఇన్ని మూమెంట్స్ రివీల్ చేశారంటే, థియేటర్లో ఇంకెన్ని డాన్సులు ఈ పాట నుంచి ఆశించవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అచ్చియ్యమ్మ విరుపులు..
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, రామ్ చరణ్ డాన్స్‌ల గురించి ఎలా చెప్పుకుంటున్నామో, జాన్వీ కపూర్ విరుపుల గురించీ అలానే చెప్పుకోవాలి.. తప్పదు.!
నిజానికి, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో హీరోయిన్లు ఇంకాస్త భిన్నంగా కనిపిస్తారు. జాన్వీ కూడా మంచి డాన్సర్ కావడంతో, తనదైన గ్లామర్ అద్దింది ఈ పాటకి.
Also Read: సన్ గ్లాసెస్ వాడుతున్నారా? మీరివి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ఒకింత హాట్ అప్పీల్ కూడా గట్టిగానే పండించింది జాన్వీ కపూర్.! ఆ పాత్రని దర్శకుడు బచ్చిబాబు సన అలా డిజైన్ చేశాడు.
దీన్ని టీజింగ్ సాంగ్ కోణంలోనే చూడాలి.. అప్పుడే, పాటలోని జాన్వీ కపూర్ గ్లామర్.. ఒకింత క్యూట్‌గా అనిపిస్తుంది.
మొత్తంగా చూస్తే, ‘చికిరి చికిరి’ సాంగ్, సెన్సేషనల్ అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
