మెగాస్టార్ చిరంజీవి ఈజ్ బ్యాక్.! కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కతోన్న ‘ఆచార్య’ (Mega Star Chiranjeevi Acharya Laahe Laahe Song)సినిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ విడుదలైంది. నిన్ననే ఈ వీడియోకి సంబంధించి చిన్న ప్రోమో వదిలారు.
అలా ఎలా.? ఛిరంజీవి ఎలా ఇన్నేళ్ళుగా అదే గ్రేస్ కొనసాగిస్తున్నారు.? అని అంతా ఆశ్చర్యపోయారు. ఇక, లిరికల్ సాంగ్ విషయానికొస్తే, మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ అదిరిపోయింది. పాట కోసం వాడిన పదాలు ఆకట్టుకుంటున్నాయి. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను చాలా అందంగా రాశారు.
సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక, ఈ పాటని ఓ పండగ వాతావరణంలో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. బోల్డంతమంది జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. కాజల్ అగర్వాల్, సంగీత.. తదితరులు లిరికల్ వీడియోలో స్పెషల్ ఎట్రాక్షన్.. మెగాస్టార్ చిరంజీవి తర్వాత.
నిర్మాత రామ్ చరణ్, ఓ ఫ్రేములో అలా అలా నడుచుకుంటూ వెళుతున్న వైనం ఈ వీడియోలో చూపించారు.
పాటలో ఎవరున్నారు.? మ్యూజిక్ ఎలా వుంది.? సినిమాటగ్రఫీ, హీరోయిన్ గ్లామర్, సెట్.. ఇవన్నీ పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవి.. కుర్రాడిలా కనిపించడం వెరీ వెరీ స్పెషల్.
అలా ఎలా.? లాహే లాహే.. అంటూ పాట రిలీజయ్యిందిగానీ, మెగాస్టార్ కటౌట్ వైపుకు అభిమానుల మనసు మాత్రం లాగే లాగే.. లాగేస్తోందన్నమాట.
ఈ లాహే లాహే.. (Mega Star Chiranjeevi Acharya Laahe Laahe Song) అంటూ పాటకు డాన్స్ మాస్టర్ దినేష్ కొరియోగ్రఫీ అందించాడు.