Chiranjeevi Artificial Intelligence Videos.. కొన్నాళ్ళ క్రితం నటి రష్మిక మండన్న పేరుతో ఓ వీడియో వైరల్ అయ్యింది. కట్ చేస్తే, అది ‘డీప్ ఫేక్’ వీడియో.. అని తేలింది.
చాలాకాలం క్రితం, నటి త్రిష పేరుతో ఓ వీడియో వైరల్ అయ్యింది. అప్పటికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నంత జోరుగా సోషల్ మీడియా లేదు.
దాదాపుగా సినీ సెలబ్రిటీలంతా, ఈ తరహా వీడియోలకు సంబంధించిన బాధితులే.! కొందరు పోలీసుల్ని ఆశ్రయించారు, కోర్టుల మెట్లెక్కారు.. కానీ, ఈ ప్రసహనం కొనసాగుతూనే వుంది.
ఇటీవలి కాలంలో, సెలబ్రిటీల పేరుతో వీడియోలు ఎక్కువైపోయాయ్. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక, చాలా చాలా తేలిగ్గా వీడియోలు సృష్టించేస్తున్నారు.
అత్యంత అసభ్యకరమైన రీతిలో రూపొందుతున్న సెలబ్రిటీల ఏఐ వీడియోలు.. ఆయా సెలబ్రిటీల్ని మానసిక క్షోభకు గురిచేస్తున్న మాట వాస్తవం.
Chiranjeevi Artificial Intelligence Videos.. సెలబ్రిటీల ఏఐ వీడియోలతో జుగుప్సాకర వ్యాపారం..
ఇంకోపక్క, తమ బ్రాండ్ల ప్రచారం కోసం, సెలబ్రిటీల ఏఐ వీడియోల్ని వాడుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. అదీ, సెలబ్రిటీల అనుమతి లేకుండా.
సెలబ్రిటీల్ని బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటే, కోట్లలో రెమ్యునరేషన్ సమర్పించుకోవాలి. ఏఐ వీడియోలు, అనుమతి లేకుండా చేసేస్తే, ఖర్చేమీ వుండదు.
ఈ క్రమంలోనే, సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫొటోలతో ఆయా ప్రోడక్టుల ప్రమోషన్స్‌కి సంబంధించిన ఏఐ వీడియోలు పెరిగిపోతున్నాయి.
Also Read: సన్ గ్లాసెస్ వాడుతున్నారా? మీరివి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
దాంతో, సెలబ్రిటీలు ఉలిక్కిపడుతున్నారు. మొన్నీమధ్యనే అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తన అనుమతి లేకుండా తన ఏఐ వీడియోలు ఎవరూ వాడకూడదని ఆర్డర్ తెచ్చుకున్నారు.
తాజాగా, మెగాస్టార్ చిరంజీవి కూడా కోర్టును ఆశ్రయించారు. తనవిగా చెప్పబడే ఏఐ వీడియోలు ఎక్కడా వుండకుండా ఆర్డర్ తెచ్చుకున్నారు చిరంజీవి.
మరింత మంది సినీ ప్రముఖులు ఇప్పుడు కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి. ఒక్కొక్కరిగా ఎందుకు, మొత్తం సెలబ్రిటీలందరి తరఫునా న్యాయస్థానాలు ఒకే తరహా ఆర్డర్ పాస్ చేసేస్తే బావుంటుంది కదా.!
