Chiranjeevi Balakrishna Waltairveerayya Veerasimhareddy రెండు సినిమాల మధ్యా పోటీ వుండాలి.. హీరోల మధ్య కూడా పోటీ వుండాలి..
ఆ పోటీ లేకపోతే మజా వుండదు. రెండూ హిట్టవ్వాలి.. అని స్వయంగా నందమూరి బాలకృష్ణ చెప్పారు ‘వీర సింహా రెడ్డి’ ప్రమోషన్ల సందర్భంగా.
మెగాస్టార్ చిరంజీవి సంగతి సరే సరి. ‘వాల్తేరు వీరయ్య’తోపాటుగా, ‘వీర సింహా రెడ్డి’ సినిమా కూడా ఘనవిజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు.
రెండు సినిమాల్నీ ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించింది. ఇక్కడ కులాల పంచాయితీ ఏంటి.? హీరోల అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడమేంటి.?
తెలుగు సినిమాకి వేరే శతృవులు అక్కర్లేదు..
మన సినిమా విశ్వ వ్యాపితమిప్పుడు.! ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచమంతా కొనియాడుతోంది. ఆ స్థాయికి తెలుగు సినిమా ఎదిగాక, ఇంకా కులాల కుంపట్లు దేనికి.?
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలోనూ ఈ కులాల కుంపట్లు చూశాం. కానీ, ఆ సినిమా విజయాన్ని ఈ గొడవలు అడ్డుకోగలిగాయా.?
‘వీర సింహా రెడ్డి’ అయినా, ‘వాల్తేరు వీరయ్య’ అయినా, కంటెంట్ వుంటే విజయం సాధిస్తాయి.. లేదంటే అంతే. కానీ, అభిమానులు కులాల వారీగా కొట్టుకుంటే లాభమేంటి.?

అమెరికాలోని ఓ థియేటర్‌లో ‘వీర సింహా రెడ్డి’ సినిమా విడుదల సందర్భంగా కొట్లాట జరిగిందట. దీన్ని కులపంచాయితీగా కొందరు అభివర్ణిస్తున్నారు. అక్కడేం జరిగిందన్నది మాత్రం ఎవరికీ తెలియదు.
Chiranjeevi Balakrishna Waltairveerayya Veerasimhareddy.. పార్టీల గోల..
కొద్ది రోజుల క్రితం న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా డల్లాస్‌లో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
Also Read: గోల్డెన్ గ్లోబ్: ‘నాటు’గా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కొనేసిందా.?
చిరంజీవి పోస్టర్లను బాలకృష్ణ అభిమానులు ధ్వంసం చేస్తే, బాలకృష్ణ పోస్టర్లను చిరంజీవి అభిమానులు ధ్వంసం చేశారట. అసలు గలాటా, వైసీపీ – జనసేన వర్గాల మధ్య అంటూ.. ఇంకో వాదన తెరపైకొచ్చింది.
ఎన్టీయార్ – చరణ్ కలిసి సినిమా చేసినా సోకాల్డ్ కులపిచ్చిగాళ్ళ పైత్యం అణగలేదు. రేప్పొద్దున్న చిరంజీవి – బాలకృష్ణ కలిసి ఒకే వేదికపై కన్పించినా, ఈ కుల పిచ్చిగాళ్ళు తట్టుకునేలా లేరు.