Table of Contents
‘వాళ్ళ పెళ్లాలతో వస్తే తెలిసేది.. మొగుళ్ళతో వచ్చి వుంటే తెలిసేది..’ అంటూ బిగ్ బాస్‌లో (Bigg Boss 3 Telugu) మేల్ కంటెస్టెంట్స్‌పైనా, ఫిమేల్ కంటెస్టెంట్స్‌పైనా (Bigg Worst Task) వితికా షెరు గుస్సా అయిన తీరు ఇప్పుడు అందర్నీ షాక్‌కి గురిచేస్తోంది. చాలామంది వితిక ఆవేదన పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ, వితికకి అంతలా అసహనం ఎందుకు వచ్చింది.? అంటే, దానికి పెద్ద కథే వుంది.
ఈ వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ప్రాసెస్‌కి సంబంధించి నామినేట్ అయిన విషయం విదితమే. మహేష్ విట్టా (Mahesh Vitta), వరుణ్ సందేశ్ (Varun Sandesh), రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), రవి కృష్ణ (Ravi Krishna), పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam), హిమజ (Himaja).. ఆ ఆరుగురు కంటెస్టెంట్స్. అయితే, వీరిలో ముగ్గురికి ఇమ్యూనిటీ ఇచ్చేలా బిగ్‌బాస్ టాస్క్‌ని డిసైడ్ చేశాడు.
Click Here: బిగ్ పాలిటిక్స్: శ్రీముఖికి ఎదురే లేదా.?
ఆరుగురు సభ్యులూ ఒకరితో ఒకరు మాట్లాడుకుని, ఫైనల్‌గా తమ నుంచి ముగ్గుర్ని ఫైనల్ చేసుకున్నారు. టాస్క్‌లో వుండి తీరతానంటూ మొండికేసినా, చివరి నిమిషంలో హిమజ గివప్ చేయడం గమనార్హం. బహుశా గత వారం ఇచ్చిన టాస్క్‌లో ఫెయిలయిన హిమజ, తాను బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్ చెయ్యలేనేమో అనే ఆందోళనతో గివప్ చేసేసి వుండాలి.
ఏదేతేనేం, వరుణ్‌తోపాటు రాహుల్ సిప్లిగంజ్, రవి కృష్ణ టాస్క్ (Bigg Boss Telugu3) చేయాల్సి వచ్చింది. చిత్రంగా ముగ్గురూ వితికనే టార్గెట్ చేశారు. ఒకరేమో, వితిక జుట్టు మీద షేవింగ్ ఫోమ్ అంతా రుద్దేస్తే, ఇంకొకరు వితికకి చెందిన ‘లవ్ సింబల్’ పిల్లోని కట్ చేసేసి, బయటనున్న స్విమ్మింగ్ పూల్‌లో పడేశాడు. మరో కంటెస్టెంట్, వితిక మొహమ్మీద కాఫీ కొట్టాడు.
Click Here: వరుణ్ – వితిక: ‘బిగ్’ ఫ్రూట్.. హాంఫట్.!
అలా కాఫీ కొట్టిన ఘనుడు ఎవరో కాదు, స్వయంగా వరుణ్ సందేశ్ కావడం గమనార్హం. ‘నీకు ఇంటికెళ్ళాక వుంటుంది చూడూ..’ అంటూ వితిక, వరుణ్‌కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిందనుకోండి చివర్లో.. అది వేరే సంగతి. ముగ్గురూ విడివిడిగా టాస్క్ చేశారు.
అది టాస్క్ అని దాదాపుగా హౌస్‌మేట్స్‌కి అర్థమయిపోయింది రవి కృష్ణకీ, వరుణ్ సందేశ్‌కీ సహకరించిన హౌస్‌మేట్స్, రాహుల్‌ని మాత్రం తీవ్రంగా ఇబ్బంది (Bigg Worst Task) పెట్టారు. ఈ క్రమంలో హౌస్‌లో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. టాస్క్ కోసం ఎగ్రెసివ్‌గా వుండాల్సి వచ్చిందంటూ టాస్క్ పూర్తయ్యాక, శ్రీముఖితోపాటు హిమజ, శివజ్యోతి కాళ్ళు పట్టేసుకున్నాడు రాహుల్.
Click Here: వితిక – వరుణ్.. ‘అది’ ఎక్కువైందా?
మొత్తమ్మీద, టాస్క్ కంప్లీట్ చేసిన వరుణ్, రాహుల్, రవి ఇమ్యూనిటీ పొందితే, నామినేషన్ రేసులో హిమజ, పునర్నవి, మహేష్ విట్టా మిగిలారు. బిగ్‌బాస్, కొత్త ఫిటింగ్ పెట్టి హౌస్‌లోంచి ఇంకెవర్నీ డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌కి నామినేట్ చెయ్యకపోతే.. ఈ ముగ్గురు చుట్టూనే ఎలిమినేషన్ ప్రాసెస్ నడుస్తుంది.
ఏదిఏమైనా, టాస్క్‌లన్నీ వితిక మీదనే ఎందుకు ఫోకస్ అయ్యాయి.? అంతలా ఆమెను మానసికంగా కుంగిపోయేలా చేయడం ఎంతవరకు సబబు.? ఈ పైత్యానికి రూపకల్పన చేసిన బిగ్‌బాస్ ఉద్దేశ్యమేంటి.?