Chiranjeevi Stop Remake Movies.. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఎలా వుంది.? అన్నది వేరే చర్చ.
అసలంటూ ‘భోళా శంకర్’ సినిమాపై అస్సలు అంచనాల్లేవు విడుదలకు ముందు. ఎందుకిలా.? ఇంకెందుకు, అది రీమేక్ సినిమా కాబట్టి.
రీమేక్ సినిమాలైతే, ప్రీ రిలీజ్ బజ్ వుండకూడదా.? ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పులొచ్చాయ్. ఓటీటీ యుగం ఇది.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఈ మార్పు నిజం.
నిజమే, రీమేకులకు కాలం చెల్లింది. అలాగని, రీమేక్స్ అస్సలు చేయకూడదా.? అంటే, అలాగనీ అనలేం. రీమేక్స్ కూడా చేయొచ్చు.! కానీ, దానికీ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Chiranjeevi Stop Remake Movies.. మొన్న బ్రో.. ఇప్పుడేమో భోళా శంకర్..
మొన్ననే ‘బ్రో’ చూశాం. పవన్ కళ్యాణ్ చేసిన సినిమా అది. అది కూడా రీమేక్. దాంతో, ఇంకో రీమేక్ అనగానే, మెగాభిమానుల్లో అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది.
పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) వేరు, చిరంజీవి (Mega Star Chiranjeevi) వేరు కాదు. ఆయన అభిమానులు, ఆయన అభిమానులు వేరు కాదు.!
వాస్తవానికి, పవన్ కళ్యాణ్ రీమేక్స్ ఎంచుకుంటున్నారంటే, దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. రాజకీయాలు.. సినిమాలు.. రెండిటినీ బ్యాలెన్స్ చేసుకునే క్రమం అది.

చిరంజీవికి అలా కాదు కదా.! చిరంజీవి కెరీర్‌లో సూపర్ హిట్స్ అయిన రీమేక్స్ వున్నాయి. కాదనలేం. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు.
అభిమానులే నెత్తీ నోరూ బాదుకుంటున్నారు రీమేక్స్ వద్దన్నయ్యా.. అని.! ప్రేక్షక దేవుళ్ళు.. అభిమానులే తమ్ముళ్ళు.. అని చిరంజీవి చెబుతుంటారు కదా.?
పునరాలోచించుకోవాల్సిందే..
తప్పదు.. చిరంజీవి (Mega Star Chiranjeevi) పునరాలోచించుకోవాలి.! చిరంజీవి ఎనర్జీ.. ఆయన వయసుని వెక్కిరిస్తోంది.
ఎవరో చేసిన సినిమాల్ని చేయడం.. సినిమాల్లో ఎవర్నో ఇమిటేట్ చేయడం (సరదాగే అయినా) బాలేదు.! అభిమానులకు అస్సలు రుచించట్లేదు.
150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి నుంచి.. ఇంకా గొప్ప సినిమాలు చేసేందుకు ఆస్కారం వుంది. ఆ స్టామినా చిరంజీవికి వుంది.!
Also Read: క్రిమినల్ థియరీ! ‘పద్మభూషణ్’ చిరంజీవికెందుకు రాజకీయం?
మెగాస్టార్ చిరంజీవి.. ఆ పేరుకి వున్న వైబ్రేషన్స్ వేరు. రీమేకులు.. ఆ పేరుకి ఇప్పుడు మకిలి అంటిస్తున్నాయ్.. అనడం అతిశయోక్తి కాకపోవచ్చేమో.! బోడి సలహానో.. ఉచిత సలహానో కదిది.. అభిమానుల మెగా ఆవేదన.!

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) అంటే ట్రెండ్ సెట్టర్.! తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి సరికొత్త నిర్వచనం చెప్పిన మగధీరుడు.!
ఆయన స్టైల్.. ఆయన జోష్.. ఆయన స్టామినా.. ఆయన ఈజ్.. ఏదైనా మెగా.! అదే మెగాస్టార్ చిరంజీవి స్ట్రెంగ్త్.! ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
ఎవరైనా, మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవ్వాల్సిందే.! మెగాస్టార్ చిరంజీవిని ఎవరైనా ఇమిటేట్ చేయాలిగానీ.. చిరంజీవి అనే మెగాస్టార్ ఇంకొకర్ని ఇమిటేట్ చేస్తే ఎలా.?