Chiranjeevi Krishnamraju Mogalturu.. మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఇద్దరి మధ్యా సన్నిహిత సంబంధాలుండేవి. చిరంజీవిని సోదర సమానుడిగా భావించేవారు కృష్ణంరాజు.
ఆ సోదర భావంతోనే, మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతిచ్చి, ఆ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు రెబల్ స్టార్. ఇది అందరికీ తెలిసిన విషయమే.
కానీ, ఇప్పుడు మొగల్తూరు మొనగాడెవ్వరు.? అన్న అంశం చుట్టూ చిరంజీవి – కృష్ణంరాజు మధ్య పోలిక తెస్తున్నాయి కొన్ని రాజకీయ శక్తులు.
Chiranjeevi Krishnamraju Mogalturu.. ఎవరు మొగల్తూరు మొనగాడు.?
మొగల్తూరుకి చిరంజీవి ఏమీ చేయలేదని కొందరు, కృష్ణంరాజు మొగల్తూరుని పట్టించుకోలేదని ఇంకొకరు కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ‘మా చిరంజీవి గొప్ప.. మా కృష్ణంరాజు గొప్ప..’ అంటూ ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నారు ఇంకొందరు.
చిరంజీవి, కృస్ణంరాజు మాత్రమ కాదు, ‘మా ఊరు మొగల్తూరు..’ అని గర్వంగా చెప్పుకునేటోళ్ళు చాలామందే వున్నారు. ఊర్లోనే వుంటూ, ఊరి బాగు కోసం కష్టపడ్డవాళ్ళని తక్కువ చేసి చూడగలమా.?
మొగల్తూరు మొనగాళ్ళయిన కృష్ణంరాజు, చిరంజీవి సినీ నటులుగా, కేంద్ర మంత్రలుగా ఎదిగారు.. తిరుగులేని స్టార్‌డమ్ ఇటు రాజకీయాల్లో, అటు సినిమా రంగంలో సంపాదించుకున్నారు.
కులాల కుంపట్లు ఎందుకు.?
చిరంజీవికిగానీ, కృష్ణంరాజుకుగానీ కులాభిమానం వుంటే వుండొచ్చుగాక.! కుల దురభిమానం అయితే లేదు. వాళ్ళిద్దరూ స్నేహితుల్లా, అన్నదమ్ముల్లా వున్నప్పుడు, వాళ్ళను అభిమానించెవాళ్ళెందుకు అలా వుండరు.?
ఈ వివాదంలోకి ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తదితరుల పేర్లనూ కొన్ని రాజకీయ శక్తులు లాగుతున్నాయి. ఈ రాజకీయ క్రీడలో అభిమానులు బలైపోతున్నారంతే.
Also Read: మీకు తెలుసా.? భూమ్మీద చీమల జనాభా 20 క్వాడ్రిలియన్స్.!
తమ రాజకీయ అవసరాల కోసం నీఛ నికృష్ట రాజకీయాలు చేసేవారి ట్రాప్‌లో ఆయా హీరోల అభిమానులు పడకుండా వుండాలి. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.?
ప్రభాస్ తన పెదనాన్న సంస్మరణ కార్యక్రమం కోసం కోట్లు ఖర్చు చేసి లక్ష మందికి భోజనాలు పెట్టాడు.. చిరంజీవి తన తండ్రి కోసం ఇలా చేశాడా.? అని నిస్సిగ్గుగా ప్రశ్నిస్తున్నారు, అసలు తిండి మొహమే ఎరగనట్టు.!