అవార్డులు అంగట్లో సరకుల్లా తయారయ్యాయి. ఓ సీనియర్ నటుడు కొన్నాళ్ల క్రితం చేసిన విమర్శలు.. కొనుక్కుంటే దొరికే అవార్డులు నాకు అవసరం లేదని ఆయన నిర్మొహమాటంగా (Rangasthalam Ram Charan) చెప్పేశారు.
కానీ, అవార్డులు ఇచ్చే కిక్ అంతా ఇంకా కాదు. ఆ కిక్ పొందడానికి సెలబ్రిటీలు అడ్డదార్లు తొక్కుతుంటారనే విమర్శలు ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నవేమీ కాదు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాలకే ఈ తరహా విమర్శలు తప్పడం లేదు.
నంది పురస్కారాల సంగతి చెప్పనే అక్కర్లేదు. జాతీయ చలన చిత్ర పురస్కారాల మీదా విమర్శలు ఎప్పటి నుండో వింటూనే ఉన్నాం. ఆ సంగతి పక్కన పెడితే, తెలుగు సినిమాపై కాస్త కనికరం చూపినట్లున్నారు జ్యూరీ మెంబర్స్.
‘మహానటి’ చిత్రానికి గాను, కీర్తి సురేష్‌కి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కింది. ఎప్పుడో ‘కర్తవ్యం’ సినిమాకి విజయశాంతి ఉత్తమ నటిగా ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఇన్నేళ్లలో ఒక్క గొప్ప నటి కూడా టాలీవుడ్ నుండి జ్యూరీని మెప్పించలేకపోయిందా.? తలచుకుంటే, ఒళ్లు మండిపోతుంది.
సరే, ఆ సంగతి పక్కన పెట్టేద్దాం.. ‘రంగస్థలం’ సినిమాకి రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో మనందరికీ తెలుసు. మరి, చరణ్ ఎందుకు అవార్డ్ దక్కించుకోలేకపోయాడు. ఈ ప్రశ్నకు ఓ మెగా అభిమాని చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.? చరణ్ చేరేంత అర్హత ఆ అవార్డుకు లేదేమో.. అని.
కేవలం చరణ్ మీద అభిమానంతోనే ఆ అభిమాని అలా అన్నాడా.? అయితే, హీరో మంచు విష్ణు రామ్‌చరణ్‌కి ఆ అవార్డు దక్కి ఉండాల్సింది. నా దృష్టిలో ఆ అవార్డుకు చరణ్ సరైన ఛాయిస్.. అని ఎందుకు అన్నాడు.? మనోజ్ ఎందుకు సమర్ధించాడు.? వీరిద్దరూ సోషల్ మీడియాల వేదికగా తమ అభిప్రాయాన్ని చెప్పారు. మరికొందరూ చెబుతున్నారు.
దాదాపుగా అందరి అభిప్రాయం చరణ్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం దక్కాల్సిందేనని. నిజానికి, ‘రంగస్థలం’ ఓ ప్రయోగం. కమర్షియల్ ఆలోచన చరణ్ చేసి ఉంటే, ‘రంగస్థలం’ సినిమా చరణ్ నుండి వచ్చేది కాదు. ఇక్కడ చరణ్ తీసుకున్న నిర్ణయం, చరణ్ పెట్టిన అఫర్ట్ ప్రేక్షకులకు నచ్చాయి.
కమర్షియల్ హీరోగా తన డాన్సులతో, తన ఫైట్స్‌తో మెగా అభిమానులను చాలాసార్లు మెప్పించినా యునానిమస్‌గా అందర్నీ చరణ్ మెప్పించింది మాత్రం ‘రంగస్థలం’తోనే. 7 అవార్డులు తెలుగు సినిమాకి దక్కినుందుకు కనిపిస్తున్న సంతోషం కంటే, చరణ్‌కి అవార్డు దక్కలేదన్న ఆవేదన తెలుగు సినిమాలో ప్రతీ ఒక్కరి నుండి కనిపిస్తోంది.
ఇంతకంటే, చరణ్ గెలిచాడు.. అనడానికి నిదర్శనం ఇంకేం కావాలి. జాతీయ అవార్డు కంటే, ఈ అభిమానం చాలా చాలా చాలా గొప్పది. అయితే, సినీ పరిశ్రమకు చెందిన ఓ పెద్ద వ్యక్తి, జాతీయ స్థాయిలో తన పలుకుబడిని ఉపయోగించి, చరణ్‌కి అవార్డు రానీయకుండా చేశాడన్న ప్రచారం సినీ వర్గాల్లో జరుగుతోంది.
అది నిజమేనా.? ఏమో చెప్పలేం. ‘రంగస్థలం’ (Rangasthalam Ram Charan) సినిమాకి ఆడియోగ్రఫీలో అవార్డు ఇవ్వడమనేది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే.
చరణ్ కెరీర్‌లో ‘చిట్టిబాబు’ అనే పాత్ర ఓ అవార్డు. తనకు తాను ఇచ్చుకున్న గిఫ్ట్ అది. ప్రేక్షకులు మెచ్చిన విజయమది. సినీ పరిశ్రమ ముక్త కంఠంలో ఒప్పుకుంటున్న నిజమిది. ఇంతమంది అభిమానం ముందు ‘పురస్కారం’ చాలా చాలా చిన్న మాట.
Click Here for Special Article on Rangasthalam