Chiyaan Vikram Health.. ఇదిగో పులి.. అంటే, అదిగో తోక.. అన్నది వెనకటి కథ.. ఇప్పుడు ట్రెండ్ మారింది.!
సెలబ్రిటీలెవరైనా ఆసుపత్రికి వెళితే చాలు, ‘తీవ్ర అనారోగ్యం.. బతికేందుకు అవకాశాలు తక్కువ..’ అంటూ న్యూస్ ఛానళ్ళు బ్రేకింగ్ వార్తల్ని బద్దలుగొట్టేస్తుంటాయ్.!
కొన్నిసార్లు అత్యుత్సాహంతో సెలబ్రిటీల్ని ముందే చంపేస్తుంటాయి న్యూస్ ఛానళ్ళు. తెలుగు నాట ఇలాంటి మీడియా బాధితులు చాలామందే వున్నారు.!
తమిళ నటుడు చియాన్ విక్రమ్ (Tamil Actor Chiyaan Vikram) విషయాన్నే తీసుకుంటే, స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడాయన.
Chiyaan Vikram Health.. అసలేమైంది చెప్మా.?
దాంతో, విక్రమ్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడనీ, ఆయనకు గుండె పోటు వచ్చిందనీ.. పరిస్థితి విషమంగా వుందనీ మీడియా నానా యాగీ చేసింది.
‘అదేం లేదు, ఆయన బాగానే వున్నారు..’ అంటూ సాక్షాత్తూ విక్రమ్ తనయుడు ధృవ్ చెప్పినా, మీడియా వినలేదు.

విక్రమ్ (Actor Vikram) పలు వైద్య పరీక్షల అనంతరం ఆల్ ఈజ్ వెల్ అనే సర్టిఫికెట్తో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. తన తాజా సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి కూడా వచ్చాడు.
మీడియా పైత్యమిది.!
నిజానికి, విక్రమ్ ఒకింత రెస్ట్ తీసుకోవాల్సి వుంది. కానీ, మీడియా ఊరుకోదు కదా.? అందుకే, మీడియాని శాంతింపజేయడానికి విక్రమ్, విధిలేని పరిస్థితుల్లో పబ్లిక్ అప్పీయరెన్స్ ఇవ్వాల్సి వచ్చినట్టుంది.
మీడియా పైత్యం అనేది చాలా చిన్నమాటగా మారిపోతుంటుంది ఇలాంటి విషయాల్లో. ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం, ఆయనకు ప్రైవసీ వుండదా.?
Also Read: ప్రియా ఆనంద్ చమత్కారం.! పటాసు పిల్లేనండోయ్.!
ఒక్కటి మాత్రం వాస్తవం. విక్రమ్ (Chiyaan Vikram) అభిమానులు ఈ మొత్తం వ్యవహారంలో చాలా బాధపడ్డారు.. చాలా ఆవేదన చెందారు కూడా.
తమ అభిమాన నటుడికి ఏమయ్యిందోనన్న ఆందోళన చాలామంది అభిమానుల్లో కనిపించింది. ఆ స్థాయిలో న్యూస్ ఛానళ్ళు వారిని భయపెట్టాయ్.!
అదే, ఆ భయమే న్యూస్ ఛానళ్ళకు కావాల్సింది. అదే వాళ్ళ టీఆర్పీ రేటింగుల్ని పెంచుతుంది.