Table of Contents
Khushi Mukherjee Dressing.. ఆమె బాలీవుడ్ నటి. నిజానికి, బెంగాలీ బ్యూటీ.! తెలుగులోనూ ఓ సినిమా చేసింది. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
పేరేమో ఖుషీ ముఖర్జీ. ఎందుకింతలా ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నట్టు.? ఆమె ఏమైనా ఘనకార్యం చేసిందా.?
చెయ్యకనేం, పెద్ద ఘనకార్యమే చేసింది. అదే, అందాల ప్రదర్శన.! చాలామంది చేస్తారు కదా, ఖుషీ ముఖర్జీ ప్రత్యేకత ఏంటి.? అంటే, వుంది మరి.!
Khushi Mukherjee Dressing.. ఇదేం డ్రెస్సు.. అంటూ, అంతటా కస్సు బుస్సు.!
కారులోంచి ఆమె అలా దిగింది. బ్లాక్ డ్రెస్ వేసుకుంది. ఇంతకీ, ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావేంటి.? ప్యాంటీ అయినా వేసుకున్నావా.?
ఖుషీ ముఖర్జీ చుట్టూ ఇలాంటి ప్రశ్నలు వచ్చేసరికి, ఆమె గుస్సా అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.
‘నేను ఎలాంటి డ్రెస్ వేసుకున్నానో, నాకు తెలుసు. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడే, నాకు ఓ ఐడియా వుంది. నేనేమీ తప్పు చేయలేదు’ అంటోంది ఖుషీ ముఖర్జీ.
గ్లామరస్ ప్రపంచంలో వున్నాను కదా..
సినిమా అంటేనే గ్లామర్.. ఆ గ్లామరస్ ప్రపంచంలో వున్నాను కాబట్టి, గ్లామరస్‌గా కనిపించాలి కాబట్టే.. అలా చేశానంటూ ఖుషీ ముఖర్జీ చెప్పుకొచ్చింది.
‘నేను జస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అయ్యాను.. మీరే, కెమెరాలు ఎక్కడెక్కడో పెడుతున్నారు..’ అంటూ తనకు అప్పనంగా కవరేజ్ ఇస్తున్న మీడియాపైనా ఖుషీ ముఖర్జీ గుస్సా అవడం గమనార్హం.
నిజమే, ఇలాంటి విషయాల్లో మీడియా అతి.. అంతా ఇంతా కాదు.! ఆమె మానాన ఆమెని వదిలెయ్యొచ్చు కదా.? ప్చ్, అలా వదిలితే.. అది మీడియా ఎలా అవుతుంది.?
వచ్చిందిలే బోల్డంత పబ్లిసిటీ..
ఎన్ని లక్షలు ఖర్చు పెడితే ఇంతలా పబ్లిసిటీ వస్తుంది.? ఖుషీ ముఖర్జీ ఇలానే అనుకుని వుండొచ్చు. అందుకే, ముందు ముందు కూడా, నా ఫ్యాషన్ ట్రెండ్ ఇలానే వుంటుందని చెప్పింది.
‘అక్కడికేదో నేను నేరం చేసినట్లు చూడొద్దు.. స్టార్ హీరోయిన్లు కూడా ఇలానే చేస్తున్నారు..’ అంటూ, చేసిన పనిని ఖుషీ ముఖర్జీ సమర్థించుకుంది.
Also Read: ఫిలిం సిటీలో దెయ్యం! కాజోల్‌కి మాత్రమే ఎందుకు కనిపించింది?
ఔను, గతంలోనూ చేసింది.. ఇప్పుడూ చేస్తోంది.. ముందు ముందు కూడా అదే అందాల ప్రదర్శన చేస్తుంటుంది ఖుషీ ముఖర్జీ.. అలవాటు పడింది మరి బాగా.!
అసలంటూ కంఫర్టబుల్ డ్రెస్సింగ్ అంటే ఏంటి.? పీలికల డ్రెస్సులు వేసుకుని, ఇబ్బందికరంగా మీడియా కెమెరాల ముందు కదలడమా.?