కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకి సినిమాల రిలీజులు వాయిదా పడాల్సి వస్తోంది. శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ఆల్రెడీ వాయిదా పడగా, తాజాగా నాని సినిమా ‘టక్ జగదీష్’ (Corona Pandemic In Tollywood Tuck Jagadish Postponed) కూడా వాయిదా పడుతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.
అన్నట్టు, సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా భాటియా జంటగా నటిస్తోన్న ‘సీటీమార్’ (Seetimaarr Tamanna Bhatia Gopichand Sampath Nandi) సినిమా కూడా విడుదల వాయిదా పడింది. ఆ విషయాన్ని కొద్ది రోజుల క్రితమే సంపత్ నంది ప్రకటించాడు.
కొన్ని సినిమాలేమో కరోనా సెకెండ్ వేవ్ ప్రభావంతో వాయిదా పడుతోంటే, మరికొన్ని సినిమాలు ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో మారిన టిక్కెట్ ధరల వ్యవహారంతో వాయిదా పడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
దాదాపు ఏడాది పాటు కరోనా పాండమిక్ నేపథ్యంలో పెద్ద సినిమాల రిలీజులు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది వేసవిని నమ్ముకుని చాలా పెద్ద సినిమాలు రంగంలోకి దిగేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నాయి. ఇంతలోనే కరోనా సెకెండ్ వేవ్ వచ్చిపడింది. ‘సినిమా థియేటర్లకు లాక్ డౌన్ వుండదు..’ అని ప్రభుత్వాల తరఫున ప్రకటనలు వస్తుండడంతో ఊపిరి పీల్చుకున్న టాలీవుడ్, టిక్కెట్ ధరల విషయమై ఏపీలో నడుస్తున్న రగడతో డైలమాలో పడిపోవాల్సి వచ్చింది.
ఆ సంగతి పక్కన పెడితే, నాని ‘టక్ జగదీష్’ విడుదల వాయిదా గురించి మాట్లాడుతూ, చిన్న బ్రేక్ మాత్రమేనని అంటున్నాడు. ఈ నెల 23న రిలీజ్ అవ్వాల్సిన ‘టక్ జగదీష్’ (Corona Pandemic In Tollywood Tuck Jagadish Postponed) వాయిదా పడిందంటే, బ్రేక్ చిన్నది కాదు, పెద్దదేనని భావించాలేమో.
ఎందుకంటే, కాస్త గ్యాప్ వచ్చిందంటే.. ఆ తర్వాత సినిమాలన్నీ ఒకదాని మీద ఒకటి పడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒకరి కోసం ఇంకొకరు కాంప్రమైజ్ అవక తప్పదు. అలా కొన్ని సినిమాలు ఇంకా వెనక్కి వెళ్ళిపోవచ్చు.
హిందీ సినిమా పరిశ్రమతో పోల్చినా, కన్నడ, తమిళ సినీ పరిశ్రమలతో పోల్చినా, తెలుగు సినీ పరిశ్రమే కాస్త ఉత్సాహంగా కనిపించింది కరోనా పాండమిక్ తర్వాత. కానీ, తెలుగు సినిమాకి కోలుకోలేని దెబ్బ ఇంకోసారి తగిలేలా కనిపిస్తోంది.