Home » మిస్టర్ కిరణ్ అబ్బవరం.! నీ స్థాయి ఎంత.?

మిస్టర్ కిరణ్ అబ్బవరం.! నీ స్థాయి ఎంత.?

by hellomudra
0 comments
Kiran Abbavaram

Kiran Abbavaram Ka Range.. ఏంటి బాబూ కిరణ్ అబ్బవరం.. నీకు పాన్ ఇండియా సినిమా కావాల్సి వచ్చిందా.? ఓ మీడియా ప్రతినిథి, యువ నటుడ్ని సంధించిన ప్రశ్న ఇది.

ఇంతకీ, ఎవరి స్థాయి ఎంత.? స్టార్ హీరోలు చేసే సినిమాలకి కూడా ఓపెనింగ్స్ సరిగ్గా దొరకని పరిస్థితిని మనం చూస్తున్నాం.

కొన్ని సినిమాలు ఎందుకు సక్సెస్ అవుతున్నాయో.. కొన్ని సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.

Kiran Abbavaram Ka Range.. ఫ్లాపు.. హిట్టు.. ఆ కథ వేరే వుంది..

చెత్త సినిమా సూపర్ హిట్ అవుతోంది. మంచి సినిమా కూడా ఫ్లాప్ అవుతున్న సందర్భాల్ని చూస్తున్నాం. చిన్న సినిమా, పెద్ద సినిమా.. అన్న తేడాల్లేవిక్కడ.

మలయాళంలో ‘మంజమ్మల్ బాయ్స్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా అందుకున్న సంచలన విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Kiran Abbavaram
Kiran Abbavaram

ఇంతకీ, ఆ సినిమాలో నటించిన నటీనటుల పేర్లు ఎంతమందికి తెలుసు.? మలయాళ సినిమా అయినా, తెలుగులో దున్నేసింది.

జస్ట్ ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కూడా, కొన్ని సంచలన విజయాల్ని అందుకుంటున్నాయి.

‘హనుమాన్’ ముందర.. వాళ్ళెంత.?

‘హనుమాన్’ సినిమా సాధించిన విజయం గురించి తెలుసు కదా.? ఆ సినిమా ముందు, స్టార్ హీరోల పెద్ద సినిమాల వసూళ్ళు కూడా వెలవెలబోయాయి.

మరి, ‘హనుమాన్’ సినిమాకి ముందు హీరో తేజ స్థాయి ఏంటి.? ఇప్పుడతని స్థాయి ఏంటి.? అప్పట్లో తేజ మీద కూడా ‘స్థాయి’ గురించిన ప్రశ్నల దాడి, సోకాల్డ్ సినీ ఎర్నలిస్టుల నుంచి జరిగింది.

ఇప్పుడు కిరణ్ అబ్బవరం మీద కూడా అలాగే, ‘స్థాయి’ గురించి ప్రస్తావిస్తూ ప్రశ్నల దాడి జరగడం శోచనీయం. కిరణ్ కొత్త సినిమా ‘క’, పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Also Read: అర్థం.. అపార్థం.! సిద్దార్ధ ‘నోటి దురుసు’తనం.!

‘క’ సినిమాకి కిరణ్ అబ్బవరం నిర్మాత కూడా. కంటెంట్ మీద ఎంత నమ్మకం లేకపోతే, కిరణ్ ఇలా పాన్ ఇండియా ప్రయోగం చేస్తాడు.?

సినిమా బావుంటే హిట్టు కొడతాడు.. తేడా కొడితే, అది మళ్ళీ వేరే చర్చ. ఇంతకీ, ‘కిరణ్, నీ స్థాయి ఎంత..’ అని ప్రశ్నించిన సినీ ఎర్నలిస్టు స్థాయి ఎంత.?

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group